కన్నడ స్టార్ హీరో యష్ అలియాస్ రాఖీ భాయ్ పుట్టినరోజు నాడు ప్రమాదవశాత్తు అభిమానులు చనిపోయిన సంగతి తెలిసిందే.. ఆ విషయాన్ని యష్ జీర్ణించుకోలేపోతున్నాడు.. పుట్టినరోజు అంటే భయమేస్తుందని చెబుతున్నాడు.. మరణించిన తన అభిమానుల మురళి, నవీన్, హనుమంత్ కుటుంబాలను యష్ స్వయంగా వెళ్లి పరామర్శించాడు. అలాగే వారి కుటుంబాలకు అండగా ఉంటానని మాటఇచ్చాడు యష్.. ఆ మాటను నిలబెట్టుకున్నాడు..
తాజాగా గడగ్ జిల్లా సోరంగి గ్రామానికి వెళ్లి నష్టపరిహారం అందించారు. ఒక్కో కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చెక్కును అందజేశారు. యష్ స్నేహితులు వచ్చి నష్టపరిహారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు కొంత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.. యష్ ఫ్యాన్స్ ప్రతి ఏడాది తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంటారు..ఈ ఏడాది కూడా గదగ్ జిల్లాలోని సోరంగి గ్రామంలో అభిమానులు తమ అభిమాన నటుడి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో అభిమానులు యష్ బ్యానర్ కడుతుండగా.. విద్యుత్ వైరు తగలడంతో మురళి, నవీన్, హనుమంత్ మరణించారు..
అభిమానుల మరణ వార్త విన్న యష్ దిగ్భ్రాంతికి గురయ్యాడు. మరుసటి రోజు సోరంగి గ్రామాన్నికి వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించాడు. మృతుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబాలను ఓదార్చారు. తన వంతు సాయం చేస్తానని యష్ అన్నాడు. ఇప్పుడు మృతుడి కుటుంబానికి ఒక్కొక్కరికి 5 లక్షలను అందించాడు.. ఇక ఇలా ఎప్పటికి వేడుకలను చెయ్యొద్దని చెప్పాడు.. ఇక ప్రస్తుతం టాక్సిక్’ పనుల్లో బిజీగా ఉన్నాడు ఈ స్టార్ హీరో.. మరో భారీ ప్రాజెక్టును కూడా లైన్లో పెట్టినట్లు తెలుస్తుంది..