ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ యామి గౌతమి పేరుకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు.. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ తో అందరి మనసు దోచుకుంది.. ఈమె పలు సినిమాల్లో కూడా నటించింది.. తెలుగులో రెండు సినిమాల్లో నటించింది.. అవి అనుకున్న హిట్ టాక్ ను అందుకోలేదు. దాంతో ఈ అమ్మడు బాలీవుడ్ కే పరిమితం అయ్యింది.. ఈ మధ్య పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. తాజాగా ఈ అమ్మడు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని షేర్ చేశారు..
యామీ గౌతమ్, దర్శకుడు ఆదిత్య ధర్ దంపతులు తమ మొదటి బిడ్డకు తల్లిదండ్రులయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా ఆదిత్య తన సోషల్ మీడియా ద్వారా చేశారు. యామీ గౌతమ్, ఆమె భర్త ఆదిత్య ధర్ తమ మొదటి బిడ్డ మగబిడ్డకు స్వాగతం పలికారు. మే 20న ఈ జంట ఇన్‌స్టాగ్రామ్‌లో క్యూట్ నోట్‌తో ఈ విషయాన్ని ప్రకటించారు.. అంతేకాదు ఆ పిల్లాడికి వేదవిద్ అనే పేరు కూడా పెట్టినట్లు తెలుస్తుంది..
ఈ పోస్ట్ చూసిన సెలెబ్రేటీలు సోషల్ మీడియా ద్వారా ఇద్దరికీ కంగ్రాట్స్ చెబుతున్నారు. దర్శకుడు ఆదిత్య ధర్ ను యామి గౌతమ్ ప్రేమించి పెళ్లాడింది. 2021 జూన్ 4న హిమాచల్ ప్రదేశ్‌లో ఈ జంట వివాహం చేసుకున్నారు.. ఆర్టికల్ 370 సినిమా అనంతరం ఆమె ప్రగ్నెన్సీని ప్రకటించారు.. ప్రస్తుతం ఈ అమ్మడు కొన్నాళ్ళు సినిమాలకు బ్రేక్ ఇచ్చే అవకాశం ఉంది..