చైనాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ ‘షావోమీ’ ఇటీవల కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను లాంచ్ చేసింది. చైనాలో రిలీజ్ అయిన సిరీస్ షావోమీ 17 (Xiaomi 17), షావోమీ 17 ప్రో (Xiaomi 17 Pro), షావోమీ 17 ప్రో మాక్స్ (Xiaomi 17 Pro Max) ఉన్నాయి. ఇప్పుడు ఈ సిరీస్‌లో అత్యంత శక్తివంతమైన మోడల్ షావోమీ 17 అల్ట్రా (Xiaomi 17 Ultra) కూడా త్వరలో లాంచ్ కానుంది. చైనీస్ 3C సర్టిఫికేషన్ సైట్‌లోని లిస్టింగ్.. ఈ ఫోన్ 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో త్వరలో లాంచ్ అవుతుందని సూచిస్తుంది.

నివేదికల ప్రకారం.. షావోమీ 17 అల్ట్రాకు సబంధించిన రెండు మోడల్ నంబర్లు బయటపడ్డాయి. అవి 2512BPNDAC, 25128PNA1C. వీటిలో ఒకటి ప్రామాణిక మోడల్ కాగా.. మరొకటి డ్యూయల్ శాటిలైట్ కమ్యూనికేషన్ వెర్షన్ అని సమాచారం. రెండు కూడా ‘MDY-18-EW’ పవర్ అడాప్టర్‌తో రానున్నాయి. అంటే 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. దాంతో షావోమీ 17 అల్ట్రా ఫోన్ చాలా త్వరగా ఛార్జ్ అవుతుంది. ఇందులో హై-ఎండ్ కెమెరా, హై-స్పీడ్ ఛార్జింగ్ ఇచ్చారు.

షావోమీ 17 అల్ట్రా ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో రానుంది. గేమింగ్, మల్టీ టాస్కింగ్, రన్నింగ్ యాప్‌లకు తగినంత సామర్థ్యంను చిప్‌సెట్ కలిగి ఉంటుంది. ఇందులో 1-అంగుళాల ప్రైమరీ కెమెరా (50-మెగాపిక్సెల్ OmniVision OV50X) ఉంటుంది. అదనంగా 50-మెగాపిక్సెల్ Samsung JN5 అల్ట్రా-వైడ్, 50-మెగాపిక్సెల్ Samsung JN5 టెలిఫోటో సహా 200-మెగాపిక్సెల్ ISOCELL HP5 పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ఈ సెటప్ వినియోగదారులకు అత్యుత్తమ ఫోటోగ్రఫీ, జూమింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

షావోమీ 15 అల్ట్రా ఫిబ్రవరి 2025లో లాంచ్ అయింది. కాబట్టి షావోమీ 17 అల్ట్రా 2026 మొదటి త్రైమాసికంలో వచ్చే అవకాశం ఉంది. 7500mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్, ప్రీమియం కెమెరా సెటప్‌తో ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ మార్కెట్‌లో బలీయమైన పోటీదారుగా మారనుంది. భారతీయ వినియోగదారులకు, ముఖ్యంగా హై-ఎండ్ కెమెరా అండ్ హై-స్పీడ్ ఛార్జింగ్ ఉన్న స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న వారికి ఈ ఫోన్ మంచి ఎంపిక అని చెప్పాలి.