WPL 2027 మినీ వేలం పూర్తి.. 25 మంది ఆటగాళ్ల కొనుగోలు.. 5 జట్ల పూర్తి స్క్వాడ్ వివరాలు ఇవే..!
- డబ్ల్యూపీఎల్ 2027 మినీ వేలం..
- వేలంలో మొత్తం 25 మంది ఆటగాళ్ల కొనుగోలు పూర్తి..
- ఇందులో 18 మంది భారత, ఏడు మంది ప్లేయర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WPL 2027: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2027 ఐదో సీజన్‌కు సంబంధించిన మినీ వేలం బుధవారం కొచ్చి వేదికగా ముగిసింది. అందుబాటులో ఉన్న పరిమిత స్లాట్ల కోసం జరిగిన ఈ వేలంలో మొత్తం 5 ఫ్రాంచైజీలు తమ పూర్తి స్థాయి స్క్వాడ్లను ఖరారు చేసుకున్నాయి. ఈ డబ్ల్యూపీఎల్ మినీ వేలంలో మొత్తం 25 మంది క్రీడాకారిణులు అమ్ముడయ్యారు. వీరిలో 18 మంది భారత ప్లేయర్లు ఉండగా, ఏడుగురు విదేశీ క్రీడాకారిణులు ఫ్రాంచైజీల తరఫున ఎంపికయ్యారు.
జట్ల కొనుగోళ్ల విషయానికి వస్తే.. యూపీ వారియర్జ్ అత్యంత దూకుడుగా వ్యవహరించి అత్యధికంగా ఎనిమిది మంది ఆటగాళ్లను సొంతం చేసుకుంది. ఆ తర్వాతి స్థానంలో ముంబై ఇండియన్స్ ఆరుగురిని కొనుగోలు చేసింది. ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ఢిల్లీ క్యాపిటల్స్ చెరో నలుగురు ప్లేయర్లను కొనుగోలు చేశాయి. ఇక గుజరాత్ జెయింట్స్ అత్యల్పంగా కేవలం ముగ్గురు క్రీడాకారిణులను మాత్రమే కొనుగోలు చేసింది. డబ్ల్యూపీఎల్ నిబంధనల ప్రకారం ప్రతీ ఫ్రాంచైజీ తమ స్క్వాడ్‌లో గరిష్టంగా 18 మంది సభ్యులను మాత్రమే చేర్చుకునే వెసులుబాటు ఉంది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్జ్ జట్లు మొత్తం 18 మందితో తమ పూర్తి స్క్వాడ్ కోటాను భర్తీ చేసుకున్నాయి. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు పర్స్‌లో తగినంత నిధులు మిగలకపోవడంతో పూర్తి కోటాను చేరుకోలేక చెరో 17 మంది సభ్యులతోనే బరిలోకి దిగాల్సి వచ్చింది.
Also Read
- ICC Rankings: జడేజా 1,683 రోజుల ఆధిపత్యానికి తెర.. నంబర్-1 ఆల్‌రౌండర్ స్థానాన్ని కోల్పోయిన జడ్డూ..
- Hyderabad: రేస్ క్లబ్ సమీపంలో భారీ పేకాట స్థావరం గుట్టురట్టు.. 12 మంది అరెస్ట్.!
- Satish Jarkiholi: ఓటర్ల జాబితా నుంచి కోటి పేర్ల తొలగింపు సరైనదే.. కాంగ్రెస్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
- AP Local Elections 2026: ఏపీలో ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్!
WPL 2027: మొత్తం 5 జట్ల పూర్తి స్క్వాడ్స్
1. ముంబై ఇండియన్స్ (Mumbai Indians Women):
హర్మన్‌ప్రీత్ కౌర్ (C), నాట్ సివర్-బ్రంట్, హేలీ మాథ్యూస్, అమన్‌జోత్ కౌర్, అమేలియా కెర్, షబ్నిమ్ ఇస్మాయిల్, సంస్కృతి గుప్తా, సజనా సజీవన్, రహిలా ఫిర్దౌస్, నికోలా కేరీ, వైష్ణవి శర్మ, తారా నోరిస్, దిశా కసత్, భారతి రావల్, లతిక ఇనామ్దార్, అక్షిత భగత్, శ్వేతా సెహ్రావత్, సానిక చాల్కే.
2. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB Women):
స్మృతి మంధాన (C), రిచా ఘోష్ (WK), ఎలీస్ పెర్రీ, లారెన్ బెల్, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, నాడిన్ డి క్లర్క్, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, జార్జియా వోల్, జెస్ జొనాసెన్, తేజల్ హసబ్నిస్, సయాలీ సత్ఘరే, క్లోయ్ ట్రయాన్, ప్రేమ రావత్, వ్రిందా దినేష్, ప్రథ్యోష కుమార్.
3. ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals Women):
జెమిమా రోడ్రిగ్స్ (కెప్టెన్), షెఫాలీ వర్మ, మరిజానే కాప్, నికీ ప్రసాద్, లారా వోల్వార్డ్ట్, చినెల్ హెన్రీ, శ్రీ చరణి, దీయా యాదవ్, మమతా మడివాలా, నందిని శర్మ, లూసీ హామిల్టన్, మిన్ను మణి, అన్నాబెల్ సదర్లాండ్, కిరణ్ నవ్‌గిరే, ఉమా కాశ్వీ, కిర్స్టీ గోర్డాన్, నజ్మా ఖాన్.
4. యూపీ వారియర్జ్ (UP Warriorz):
మెగ్ లానింగ్ (కెప్టెన్), దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, హర్లీన్ డియోల్, క్రాంతి గౌడ్, శిఖా పాండే, షిప్రా గిరి, సిమ్రాన్ షేక్, ప్రతీక రావల్, సోఫీ మోలినెక్స్, గ్రేస్ హ్యారిస్, సుష్మా వర్మ (వికెట్ కీపర్), స్నేహ్ రాణా, సహానా పవార్, మనాలి దక్షణి, కేథరిన్ బ్రైస్, ఆశా శోభన.
5. గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants):
యాష్లే గార్డ్నర్ (కెప్టెన్), బెత్ మూనీ, సోఫీ డివైన్, రేణుకా సింగ్ ఠాకూర్, భారతి ఫుల్మాలి, కాశ్వీ గౌతమ్, కనికా అహుజా, తనూజా కన్వర్, జార్జియా వేర్హామ్, అనుష్క శర్మ, హ్యాపీ కుమారి, కిమ్ గార్త్, యాస్తిక భాటియా, రాజేశ్వరి గైక్వాడ్, జింతిమణి కలిత, జి. కమలిని, ఓర్లా ప్రెండర్‌గాస్ట్, సమైరా రాఘవ్.
What went behind signing the 𝙮𝙤𝙪𝙣𝙜𝙚𝙨𝙩 𝙥𝙡𝙖𝙮𝙚𝙧 𝙚𝙫𝙚𝙧 at a #TATAWPLAuction? 🔍 💙
🎥 @DelhiCapitals Head Coach Jonathan Batty tells us more on the historic bid for 1️⃣5️⃣-year-old Uma Kashvi, among other key buys 👏
#TATAWPL https://t.co/7qcp4OslM0
— Women’s Premier League (WPL) (@wplt20) October 29, 2026
తాజావార్తలు
-
WPL 2027 మినీ వేలం పూర్తి.. 25 మంది ఆటగాళ్ల కొనుగోలు.. 5 జట్ల పూర్తి స్క్వాడ్ వివరాలు ఇవే..!
-
ICC Rankings: జడేజా 1,683 రోజుల ఆధిపత్యానికి తెర.. నంబర్-1 ఆల్‌రౌండర్ స్థానాన్ని కోల్పోయిన జడ్డూ..
-
Nagpur MLC Election Result: నాగ్‌పూర్‌లో బీజేపీకి షాక్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం! ఎవరీ అభిజీత్ వంజారీ?
-
Hyderabad: రేస్ క్లబ్ సమీపంలో భారీ పేకాట స్థావరం గుట్టురట్టు.. 12 మంది అరెస్ట్.!
-
US Fed Interest Rate Decision: అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లు యథాతథం
ట్రెండింగ్
-
బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సరికొత్త ఫీచర్లతో KTM 200 Duke లాంచ్..!
-
WPL Auction 2027: వైభవ్ సూర్యవంశీ మాదిరే.. డబ్ల్యూపీఎల్‌లో అత్యంత పిన్న వయస్కురాలు.. ఎవరీ ఉమా కాశ్వి!
-
RCB Full Squad: నలుగురు కొత్త ప్లేయర్లు, స్టార్ ఆల్‌రౌండర్లు.. ఆర్సీబీ ఫుల్ స్క్వాడ్ ఇదే!
-
WPL Auction 2027: చాలా తక్కువ ధరకే స్టార్ ప్లేయర్లు.. ముంబై ఇండియన్స్ భలే లక్కీ.. ఫుల్ స్క్వాడ్ ఇదే!
-
6,100mAh బ్యాటరీ, కిరిన్ 8000S చిప్సెట్, AI సెక్యూరిటీ ఫీచర్లతో Huawei Enjoy 100 స్మార్ట్‌ఫోన్ లాంచ్..!