worlds most flexible girl: ఈ అమ్మాయి ఒంట్లో ఎముకలున్నాయా.. డౌటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
worlds most flexible girl: సాధారణంగా కొంతమంది శరీరాలను ఒంపులు తిప్పితేనే ఏం తిప్పుతున్నారు.. ఒంట్లో ఎముకలున్నాయా అని సందేహపడతాం.. కానీ 14ఏళ్ల అమ్మాయి తన శరీరాన్ని పూర్తి స్థాయిలో తిప్పి అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. అంతే కాదు శరీర ఒంపులో గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా నెలకొల్పింది. యూకేలోని పీటర్ బరోకు చెందిన లిబర్టీ బారోస్ అనే 14ఏళ్ల బాలిక ఓ జిమ్నాస్ట్. ఆమె శరీరం ఓ ప్రత్యేకతను కలిగి ఉంది. దీంతో ఆమె కొన్నేళ్ల కిందటి నుంచి మెలిపెట్టడం మొదలుపెట్టింది. అలా మెల్లగా శరీరం మొత్తాన్ని ఎటు పడితే అటు వంచేసే సామర్థ్యం సంతరించుకుంది.
తాజాగా ‘ప్రపంచంలోనే అత్యంత ఫ్లెక్సిబుల్ గర్ల్’గా గిన్నిస్ బుక్ రికార్డు కూడా సృష్టించింది. తలను వెనక్కి తిప్పి కాళ్ల మధ్యగా తెచ్చి తన ఉదర భాగాన్ని నేలకు ఆన్చే ఫీట్ చేసింది. ఇలా కేవలం 30 సెకన్లలో పదకొండు సార్లు వంచి గిన్నిస్ బుక్ కు ఎక్కింది. సాధారణంగా మనుషులెవరూ ఇలా చేయలేరని గిన్నిస్ బుక్ ప్రతినిధులు పేర్కొనడం గమనార్హం.
Also Read
- Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
- Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
- Pakistan-Taliban Tensions: పాకిస్తాన్‌కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్‌లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
- CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
Read Also: China Spy Ship : స్వదేశానికి చేరుకున్న శాటిలైట్ షిప్
శరీరాన్ని విభిన్నంగా వంచుతూ లిబర్టీ బారోస్ పలు ఫొటో షూట్లు కూడా చేసింది. తన పేరిటే ఒక ప్రత్యేకమైన వెబ్ సైట్ కూడా ఉంది. అందులో తన శరీరాన్ని స్ప్రింగుల్లా తిప్పేస్తూ చేసిన ఫీట్లకు సంబంధించిన ఫొటోలు కూడా పెట్టడం గమనార్హం. ఇప్పుడు కేవలం ప్రపంచ రికార్డును అధికారికంగా నమోదు చేసుకోవడం కోసం మాత్రమే.. గిన్నిస్ బుక్ వారి ముందు ఫీట్ చేసినట్టు లిబర్టీ తండ్రి రామ్ బారోస్ చెప్తున్నారు.
“నేను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ అని చెప్పుకోగలిగినందుకు చాలా గర్వంగా ఉంది. ఇది అద్భుతమైన విజయం. నా ఫ్లెక్సిబిలిటీని గ్రహించడం వల్ల నేను ఊహించిన దానికంటే మరింత ముందుకు తీసుకెళ్లాను. ఇది నా జీవితాన్ని మార్చివేసింది, ”అని ఆమె చెప్పినట్లు పీటర్‌బరో టెలిగ్రాఫ్ పేర్కొంది. 2017లో ఆమె ఫ్లెక్సిబిలిటీ గురించి తెలుసుకున్నట్లు నివేదిక పేర్కొంది.
Read Also: Womens Asia Cup 2022: గెలుపే లక్ష్యంగా.. నేడు థాయ్‌లాండ్‌తో భారత్ ఢీ
లిబర్టీ తన యూట్యూబ్ వీడియోలతో ఇప్పటికే బాగా ప్రాచుర్యం పొందింది. ఆమె స్పెయిన్స్ గాట్ టాలెంట్‌లో పోటీదారు కూడా. తనకు యాక్షన్ సినిమాల్లో నటించాలని ఉందని చెప్పుకొచ్చింది. అలాగే తను సొంతంగా కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రజలకు నృత్యం, శరీరాన్ని కదిలించడం ఎలాగో నేర్పించాలని అనుకుంటున్నట్లు వివరించింది.
తాజావార్తలు
-
Gondhal Oscars 2027: రూ.84 లక్షలే వసూలు చేసిన ‘గోంధల్’.. రూ.3000 కోట్ల ‘ధురంధర్’ను దాటి ఆస్కార్ రేసులోకి ఎలా వెళ్లిందంటే?
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
-
Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
-
Ashwagandha: ఆయుర్వేద మందు వాడింది.. తర్వాత బ్రెయిన్ డ్యామేజ్.. అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!