World Highest Polling Station: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ కేంద్రం.. ఎక్కడో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
World Highest Polling Station: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ కేంద్రంగా హిమాచల్ ప్రదేశ్‌లోని తాషిగ్యాంగ్ రికార్డు నెలకొల్పింది. సముద్ర మట్టానికి 15,256 అడుగుల ఎత్తులో తాషిగ్యాంగ్ ఉంది. ఈ ఊరిలో మొత్తం 52 మంది ఓటర్లు ఉన్నారు. . ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉన్న పోలింగ్ బూత్‌గా రికార్డు సృష్టించారు. ఇవాళ హిమాచల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ పోలింగ్ కోసం మారుమూల ప్రాంతాల్లో మూడు తాత్కాలిక ఓటింగ్ కేంద్రాలు సహా రాష్ట్రవ్యాప్తంగా 7,884 పోలింగ్ స్టేషన్లను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.
Election Commission: ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఎగ్జిట్, ఒపీనియన్ పోల్స్‌పై నిషేధం
Also Read
ఇక కొండ ప్రాంతాల వాళ్ల కోసం కూడా ప్రత్యేకంగా పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. అత్యంత ఎత్తులో ఉన్న తాషిగ్యాంగ్ బూత్‌లో మొత్తం 52 మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగ ఓటర్ల కోసం ఆ బూత్‌ను మోడల్ పోలింగ్ స్టేషన్‌గా మార్చారు. హిమాచల్‌లో మొత్తం 68 నియోజకవర్గాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్, మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ సహా మొత్తం 412 మంది అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా 68 నియోజకవర్గాల్లో ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. డిసెంబర్ 8వ తేదీన ఫలితాలను వెల్లడించనున్నారు.
Tashigang (Lahaul&Spiti ), has world’s highest polling station at 15,256 ft & 52 registered voters, is set to retain its record of 100% voter turnout in the Nov 12 assembly election. It has been made Model Polling station to make voting easy for senior citizens & disabled voters. pic.twitter.com/SJcw86Z3lL
— CEO Himachal (@hpelection) November 12, 2022
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్‌గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్‌గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!