Pakistan: పాకిస్థాన్ రహస్యంగా అణ్వాయుధాలను పరీక్షిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వాదనను పాక్ తోసిపుచ్చింది. పాకిస్థాన్ అణు పరీక్షలను తిరిగి ప్రారంభించిన మొదటి దేశం కాదని ఓ పాకిస్థాన్ సినియర్ అధికారి అన్నారు. “పాకిస్థాన్ అణు పరీక్షలు నిర్వహించిన మొదటి దేశం కాదు.. అలాగే అణు పరీక్షలను తిరిగి ప్రారంభించిన మొదటి దేశం కూడా కాబోదు.” అని తెలిపారు. అమెరికా అధ్యక్షుడి వాదనను అబద్ధాలకోరుగా తోసిపుచ్చారు. కాగా.. పాకిస్థాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ట్రంప్ ను సపోర్టు చేస్తూ.. ఆయన అడుగు జాడల్లో నడిచిన విషయం తెలిసిందే. కానీ ట్రంప్ చైనా, రష్యాలతో పాటు పాకిస్థాన్‌ను సైతం నిందించడంతో వ్యతిరేకత మొదలైంది.
READ MORE: Increase: మొబైల్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరగనున్న రీఛార్జ్ ధరలు..
అసలు ట్రంప్ ఏమన్నారు..?
అణు పరీక్షలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ కూడా అణు పరీక్షలు చేయబోతుందని ట్రంప్ ప్రకటించారు. ఆదివారం సీబీఎస్ న్యూస్‌తో ‘60 మినిట్స్’ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు. అణు పరీక్షలపై అడిగిన ప్రశ్నలకు ట్రంప్ సమాధానం ఇస్తూ.. అన్ని దేశాలు అణు పరీక్షలు చేస్తు్న్నాయని.. ప్రపంచ ధోరణిని బట్టి అమెరికా కూడా అణు పరీక్షలు చేయాల్సి వస్తుందని తెలిపారు. ట్రంప్ ప్రకటనతో మూడు దశాబ్దాల తర్వాత అమెరికా అణు పరీక్షలు చేయడానికి సిద్ధపడుతోంది. ఇక ట్రంప్ ప్రకటనపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చ సాగుతోంది.
READ MORE: Gold Rate Today: కుప్పకూలిన బంగారం ధరలు.. వెండి భారీగా పతనం!
రష్యా, చైనా, ఉత్తర కొరియా, పాకిస్థాన్‌తో సహా అనేక దేశాలు అణు పరీక్షలు నిర్వహిస్తున్నాయని.. అమెరికా మాత్రమే అలా చేయని ఏకైక దేశంగా మిగిలిపోయిందని అన్నారు. ప్రపంచ ధోరణి ప్రకారమే అమెరికా ముందుకు వెళ్తోందని చెప్పుకొచ్చారు. రష్యా, చైనా గురించి బయట సమాజానికి తెలియదు.. అమెరికా గురించి మాత్రం బహిరంగంగా తెలిసిపోతుందని వివరించారు. అణు పరీక్షలు గురించి రాసే విలేకర్లు రష్యా, చైనా దగ్గర లేరని.. అమెరికాలో మాత్రం ఆ స్వేచ్ఛ ఉందని పేర్కొన్నారు. ఇటీవల రష్యా పోసిడాన్ నీటి అడుగున డ్రోన్‌తో సహా అధునాతన అణ్వాయుధ సామర్థ్యాన్ని పరీక్షించిందని తెలిపారు. ఉత్తర కొరియా అయితే నిరంతరం అణు పరీక్షలు చేస్తూనే ఉందని చెప్పారు. ఇతర దేశాలు కూడా అలానే చేస్తున్నాయని.. అమెరికా మాత్రమే ఎందుకు పరీక్షించకూడదని ట్రంప్ వ్యాఖ్యానించారు.
