భారతదేశంలో బంగారం ధర అక్టోబర్ 20న 1.35 లక్షల రూపాయల వద్ద ఆల్ టైం రికార్డు నెలకొల్పింది. అప్పటి నుంచి పసిడి ధరలు కాస్త తగ్గడం మనం చుస్తున్నాం. గత వారం రోజులుగా పెద్దగా తేడా లేని బంగార ధరల్లో.. సోమవారం మాత్రం మార్పు కనిపించింది. నిన్న పెరిగిన ధరలు.. ఈరోజు అకస్మాత్తుగా తగ్గాయి. 24 క్యారెట్ల 1 గ్రాము పసిడిపై రూ.71 తగ్గగా.. 22 క్యారెట్ల 1 గ్రాముపై రూ.65 తగ్గింది.
ఈరోజు బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,460గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.710 తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,12,250గా నమోదైంది. నిన్నటి కంటే రూ.650 తక్కువగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖ, విజయవాడలో ఇదే ధరలు ట్రేడ్ అవుటున్నాయి. మరోవైపు వెండి ధర భారీగా తగ్గింది. ఈరోజు బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై 3 వేలు తగ్గి.. రూ.1,51,000గా నమోదైంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,65,000గా కొనసాగుతోంది.