Iran Crisis: అగ్రరాజ్యం దెబ్బకు ఇరాన్ గజగజ.. ఖమేనీ చూపు దుబాయ్ వైపు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran Crisis: ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ తన కుటుంబంతో సహా దుబాయ్‌కు పారిపోవాలని ప్లాన్ చేస్తున్నట్లు తాజాగా ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. ఇరాన్లో కొనసాగుతున్న అశాంతి మధ్య ఖమేనీ కుమారుడు దుబాయ్‌కు $1.5 బిలియన్లు (₹1,353 కోట్లు) బదిలీ చేశాడని ఈ ఛానల్ పేర్కొంది. అయితే ఈ డబ్బు బదిలీకి కారణం ఏంటనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఈ విషయంపై ఇరాన్ ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారికంగా వ్యాఖ్యానించలేదు.
READ ALSO: Supreme Court: సుప్రీంకోర్టులో బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి చుక్కెదురు..
Also Read
- Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
- Pakistan: "మక్కా ఒప్పందం అండగా లేదు".. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
- Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
- SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. 'మిస్టర్ 360' అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
1989లో ఖొమేనీ మరణం తరువాత, అలీ ఖొమేనీ ఇరాన్ సుప్రీం నాయకుడిగా నియమితులయ్యారు. ఆయతుల్లా అలీ ఖమేనీ కుటుంబంలో ఆయన భార్య మన్సౌరే ఖోజాస్తేతో సహా 10 మందికి పైగా సభ్యులు ఉన్నారు. ఖమేనీకి నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఖమేనీతో పాటు, ఆయన కుమారుడు మోజ్తాబా ఖమేనీ కూడా ఇరాన్లో శక్తివంతమైన వ్యక్తిగా ఎదిగాడు. ఇప్పటికే మోజ్తాబా.. ఇరాన్లో ఖమేనీ వారసుడి రేసులో బలమైన పోటీదారుగా ఉన్నారు.
దుబాయ్ పారిపోవడానికి ప్లాన్..
పలు నివేదికల ప్రకారం.. ఇరాన్ – ఇజ్రాయెల్.. రష్యా సహాయంతో ఒక ఒప్పందానికి వచ్చాయి. ఈ ఒప్పందం ప్రకారం ఏ దేశం కూడా మరొక దేశంపై మొదటి దాడి చేయకూడదు. దీని అర్థం ఇరాన్ లేదా ఇజ్రాయెల్ మరొక దేశంపై మొదటి దాడి చేయవు. అటువంటి పరిస్థితిలో యుఎఇ, ముఖ్యంగా దుబాయ్, ఇరాన్‌కు సురక్షితమైన స్వర్గధామం అని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే ఇరాన్ – యుఎఇ మధ్య కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. ఇటీవల రెండు దేశాలు యెమెన్ పై చర్చలు కూడా జరిపాయి. జూన్ 2025 లో ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య జరిగిన యుద్ధాన్ని పరిష్కరించడంలో యుఎఇ ప్రధాన పాత్ర పోషించింది.
దుబాయ్‌కి ముందు ఖమేనీ కుటుంబం రష్యాకు పారిపోతుందనే చర్చ కూడా జరిగింది. ఇరాన్లో సంక్షోభం ఏర్పడితే ఖమేనీ తన మొత్తం కుటుంబంతో రష్యాకు పారిపోవచ్చని బ్రిటన్‌కు చెందిన ది టైమ్స్ నివేదించింది. రష్యా ఇరాన్ కు అత్యంత సన్నిహిత మిత్రదేశం. 86 ఏళ్ల ఖమేనీ ప్రస్తుతం తన కుటుంబంతో టెహ్రాన్ లో నివసిస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్లో జరుగుతున్న నిరసనలు, మరొక వైపు అమెరికా, ఇజ్రాయెల్ భయం మధ్య ఖమేనీ ఏం చేస్తాడనే ఆసక్తిగా మారింది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
-
Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
-
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!