World Labour Day: ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు జరుగుతుంటాయి.. కానీ, కొన్ని చిరస్థాయిగా నిలిచిపోతాయి.. దానికి ప్రధాన కారణం.. ఆ ఉద్యమం సాధించిన ఫలితమే అని చెప్పాలి.. అలాంటిదే మేడే.. ప్రపంచ కార్మిక దినోత్సవంగా మే 1వ తేదీన అన్ని దేశాల్లో జరుపుకుంటున్నారు.. అసలు మేడే ఎలా వచ్చింది.. ఎందుకు పుట్టింది.. అది ఏం సాధించింది? అనే విషయాల్లోకి వెళ్తే.. ‘‘ప్రపంచ కార్మికులారా ఏకంకండి..! పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప..!’ అంటూ మార్క్సిస్టు నేత కార్ల్‌మార్క్స్ ఇచ్చిన నినాదంతో.. ప్రపంచ కార్మికులు ఉత్తేజంగా ముందుకు సాగారు.. 1886కు పనిగంటలు 18 గంటలు, 16 గంటలుగా అమల్లో ఉండేవి.. కార్మికుల శ్రమను యజమానులు దోచుకునేవారు.. గంటల తరబడి పనిచేసి కార్మికులు తీవ్రమైన అనారోగ్యం బారినపడేవారు.. అయితే, ఈ దోపిడీ విధానం పోవాలంటూ ప్రపంచ కార్మికులు అన్ని దేశాల్లో పోరాటాలు ప్రారంభించారు.. అమెరికాలోని చికాగో సిటీ గడీలలో, కార్ఖానాల్లో పనిచేసే కార్మికులు తమకు పనికి తగ్గ వేతనం కావాలంటూ ఆందోళనకు దిగారు.. దీంతో అక్కడి యాజమానులు, భూస్వాములు కలిసి కార్మికులకు పనికి తగిన వేతనం ఇవ్వకుండా వారిని పొట్టున పెట్టుకున్నారు. వందలాది మంది కార్మికులను దారుణంగా చంపివేశారు. ఆ రక్తపు మడుగులోంచి కార్మికుల్లో ఒకరు రక్తంతో తడిసిన తన చేతి రుమాలును తీసి కార్మిక జెండాగా పైకి ఎగురవేశారు.
దీంతో.. అప్పటి నుంచి మే 1ని ప్రపంచ కార్మిక దినోత్సవం (మేడే)గా జరుపుకుంటున్నారు. అనేకమంది తమ ప్రాణాలను అర్పించి.. శ్రమదోపిడీపై విజయం సాధించారు.. దీంతో, 1886 మే 1వ తేదీ నుంచి 8 గంటల పని విధానం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ప్రతీ ఏడాది మే 1వ తేదీని మేడేగా జరుపుకుంటారు.. మేడే అంటే కార్మికుల పండుగ. అన్ని వర్గాల కార్మికులు ఎంతో ఆనందంగా, సంతోషంగా ఈ రోజు ఉత్సవాలను జరుపుకుంటారు. ప్రతీ పరిశ్రమ, ప్రతీ కంపెనీ, ప్రతీ సంస్థ దగ్గరే కాదు.. ఊరువాడా కూడా మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ.. వారి పోరాటాన్ని గుర్తుచేసుకుంటూ.. ఎన్నో రకాల పాటలు వచ్చాయి.. వస్తూనే ఉన్నాయి.. పనిగంటల పోరాటంలో పుట్టిన ఎర్రజెండా.. ఇప్పటికీ.. ఎప్పటికీ.. కార్మికులు ఉన్నంత కాలం ఎగురుతూనే ఉంటుంది. ఇక, మే దినోత్సవం లేదా మే డే ప్రతి సంవత్సరం మే 1 వ తేదీన జరుపుకునే స్మారక దినం. అన్ని ప్రభుత్వాలు దీనిన సెలవు దినగంగా ప్రకటించాయి.. చాలా దేశాలలో మే దినం, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం లేదా కార్మిక దినోత్సవంగా.. కార్మికుల పోరాటం, కార్మికుల ఐక్యతకు ప్రతీకగా జరుపుకుంటారు.
అయితే, యాంత్రికయుగం రాకముందు కార్మికులు గంటలకొద్దీ పనిచేసేవారు.. అదొక బానిస బతుకు. మనిషి తన విజ్ఞాన పరిశోధనల మూలంగా యంత్రాలను సృష్టించుకున్నాడు. యాంత్రిక యుగంలో క్యాపిటలిజం ఏవిధంగా పెరిగిందో అదే స్థాయిలో సామాజిక స్పృహ, చైతన్యం కూడా పెరిగాయి. అందువల్లనే పనిగంటల పోరాటం వచ్చింది. ఇక, భారత్‌లో చికాగో కంటే ముందే కలకత్తాలో కార్మికులు నిర్ణీత పనిగంటల కోసం హౌరా రైల్వేస్టేషన్‌లో 1862లో సమ్మెచేశారు. అప్పటివరకు ఆ రైల్వే కార్మికులు 10 గంటలు పనిచేసేవారు. అప్పుడే బెంగాల్ పత్రికల్లో పాలకవర్గానికి చెందిన అధికారులు ఎన్ని గంటలు పనిచేస్తారో మేము కూడా అన్ని గంటలే పనిచేస్తామని డిమాండ్ చేశారు. కాగా, అది విస్తృత స్థాయిలో ప్రజా పోరుగా మారలేదని చెబుతుంటారు. ఇక, 1923లో మొదటిసారి భారతదేశంలో ‘మే డే’ను పాటించడం జరిగింది. 1920లో ట్రేడ్ యూనియన్ ఏర్పడటం మూలంగా అప్పటినుంచే కార్మికవర్గంలో చైతన్యం పెరగడం మొదలైంది. అప్పటినుండి ‘మే డే’ను పాటించడం జరుగుతుంది.