Ramappa: యునెస్కో గుర్తింపు పొందిన రామప్పలో ప్రపంచ వారసత్వ దినోత్సవ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శిల్పం వర్ణం కృష్ణం సెలబ్రేటింగ్ ది హెరిటేజ్ ఆఫ్ రామప్ప పేరుతో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మిరుమిట్లు గొలిపే రంగురంగుల లేజర్ షోతో రామప్ప వెలిగిపోతోంది. ఉత్సవాల్లో భాగంగా ఉదయం ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించగా మంత్రి సత్యవతి రాథోడ్ స్టాల్స్‌ను సందర్శించి సందడి చేశారు. ఈ సాయంత్రం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
Read Also: BRS Ministers: రామప్పలో ప్రపంచ వారసత్వ దినోత్సవ ఉత్సవాలు.. సీఎం కేసీఆర్ నిర్ణయం
వేడుకల్లో భాగంగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్, ప్రముఖ డ్రమ్స్ వాయిద్య కారుడు శివమణి, సింగర్ కార్తీక్, ప్లూటిస్ట్ నవీన్ తో పాటు 300 మంది కళాకారులతో ప్రదర్శనలు నిర్వహిస్తుండగా మంత్రి సత్యవతి రాథోడ్ సరదాగా డ్రమ్ వాయించారు. ప్రపంచవ్యాప్తంగా 255 కట్టడాలు యునెస్కో వారసత్వ హోదా గుర్తింపు కోసం పోటీ పడగా రామప్ప కట్టడం యునెస్కో జాబితాలో చోటు సంపాదించుకోవడం భారతీయులందరికీ గర్వకారమన్నారు.