NTV Telugu Site icon

World Economic Forum : దావోస్‌లో తెలుగు రాష్ట్రాల సీఎంలు.. రాష్ట్రాలకు పెట్టుబడులే లక్ష్యంగా..

Cm Chandrababu Cm Revanth R

Cm Chandrababu Cm Revanth R

World Economic Forum : ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సు సోమవారం స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ప్రారంభం కానుంది. ఈ సదస్సు ఈ నెల 24 వరకు కొనసాగనుంది. ప్రపంచంలోని శక్తివంతమైన నేతలు, వివిధ రంగాల ప్రముఖులు సుమారు 2,500 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు సమాచారం. ఈ సందర్భంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దావోస్ చేరుకున్నారు. విజయవాడ నుండి బయలుదేరిన చంద్రబాబు ముందుగా ఢిల్లీ చేరుకుని, అక్కడ నుంచి అర్ధరాత్రి జ్యూరిచ్ చేరుకుని, సోమవారం ఉదయం పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. అనంతరం రోడ్డు మార్గంలో దావోస్ చేరుకున్నారు.

Pawan Kalyan: డిప్యూటీ సీఎం అనే పదానికి పవన్ కళ్యాణ్ వన్నె తెచ్చారు!

ఇదిలా ఉంటే.. సింగపూర్ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ నుంచి దావోస్ కు బయలుదేరి వెళ్లారు. ఈ సమయంలో, రెండు తెలుగు రాష్ట్రాలు పెట్టుబడులు ఆకర్షించేందుకు తమ ప్రత్యేకమైన ప్లాన్‌లను సిద్ధం చేసుకున్నారు. చంద్రబాబు “బ్రాండ్ ఏపీ”తో, రేవంత్ రెడ్డి “రైజింగ్ తెలంగాణ”తో దావోస్ వెళ్లారు. అయితే.. రెండు తెలుగు రాష్ట్రాల బృందాలు దావోస్‌ కలిసిన ఫోటో ఆసక్తికరంగా మారింది. ఇందులో ఏపీ బృందం తరుఫున సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు లు ఉండగా.. తెలంగాణ బృందం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబులు ఉన్నారు.

Komatireddy Venkat Reddy : 65వ నెంబర్ జాతీయ రహదారిని ఆరు లైన్‌లుగా విస్తరించాలనేది నా కల