D Gukesh: ఇప్పుడే మొదలైంది.. ఇంకా చాలా ఉంది: గుకేశ్
- ప్రపంచ ఛాంపియన్షిప్ గెలిచిన గుకేశ్
- జీవితంలోనే అత్యుత్తమ సందర్భం
- కార్ల్సన్ స్థాయికి చేరుకోవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పుడే తన కెరీర్ మొదలైందని, ఇంకా చాలా ఉందని ప్రపంచ చెస్ ఛాంపియన్ దొమ్మరాజు గుకేశ్ తెలిపారు. ప్రపంచ ఛాంపియన్షిప్ గెలిచినంత మాత్రాన తానే అత్యుత్తమం కాదని, మేటి ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్ స్థాయికి చేరుకోవాలని ఉందని చెప్పాడు. గత పదేళ్లుగా ఈ క్షణం కోసం కల కన్నా అని, ఆరేడేళ్ల వయసు నుంచి ఇదే లక్ష్యంగా సాగుతున్నా అని పేర్కొన్నాడు. తన జీవితంలో అత్యుత్తమ సందర్భం ఇదే అని గుకేశ్ చెప్పుకొచ్చాడు. గురువారం జరిగిన చివరి రౌండ్లో డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్ (చైనా)ను ఓడించి విశ్వ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.
గుకేశ్ మాట్లాడుతూ… ‘గత పదేళ్లుగా ఈ క్షణం కోసం ఎంతో ఎదురుచూశా. 6-7 ఏళ్ల వయసు నుంచి ఛాంపియన్ లక్ష్యంగా పెట్టుకున్నా. ఇప్పుడు నా కల నెరవేరినందుకు సంతోషంగా ఉంది. ప్రతి చెస్ ఆటగాడు ఛాంపియన్ గెలవాలని కోరుకుంటాడు. ఇప్పుడు నేను ఛాంపియన్ గెలిచాను. నా తల్లిదండ్రులు ఈ విజయం కోసం నాకంటే ఎక్కువగా ఎదురు చూశారు. అమ్మతో ఫోన్లో మాట్లాడుతూ ఒక్కసారిగా ఏడ్చేశా. 2013 ప్రపంచ ఛాంపియన్షిప్ మ్యాచ్‌లో విశ్వనాథ్ ఆనంద్, మాగ్నస్ కార్ల్సన్ పోటీపడుతుంటే చూశా. ఏదో ఒక రోజు ఆ అద్దాల గదిలో కూర్చువాలనుకున్నా. ఇప్పుడు అద్దాల గదిలో కూర్చోవడం, పక్కనే భారత పతాకం ఉండటం నా జీవితంలోనే అత్యుత్తమ సందర్భం’ అని తెలిపాడు.
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
Also Read: D Gukesh: ప్రపంచ ఛాంపియన్ గుకేశ్‌కు ప్రైజ్‌మనీ ఎంతంటే?
‘మాగ్నస్ కార్ల్సన్ గెలిచినప్పుడు ఛాంపియన్ టైటిల్‌ను భారత్‌కు నేనే తీసుకురావాలని అనుకున్నా. అతిపిన్న వయస్సు ప్రపంచ ఛాంపియన్‌గా నిలుస్తా అని 2017లోనే చెప్పా. ఈ విజయాన్ని ఊహించలేదు. అందుకే గెలిచిన తర్వాత కాస్త భావోద్వేగానికి గురయ్యా. తొలి గేమ్‌లోనే ఓడిపోయాక లిఫ్ట్‌లో విషీ సర్ కలిసి మాట్లాడారు. 2006లో తొలి గేమ్‌లో ఓడాక 11 గేమ్‌లే మిగిలాయని, ఇప్పుడు 13 గేమ్‌లు ఉన్నాయి కాబట్టి నీకు అవకాశాలు వస్తాయి అని చెప్పారు. విషీ సర్ నాకు ఎప్పుడూ మద్దతుగా ఉంటారు. అత్యున్నత స్థాయి చెస్ ఆడాలన్నదే నా లక్ష్యం. ఇప్పుడే నా కెరీర్ మొదలైంది, ఇంకా చాలా ఉంది. కార్ల్సన్ స్థాయికి చేరుకోవాలి’ అని గుకేశ్ తెలిపాడు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!