వేసవి కాలం వచ్చేసిందంటే చాలా వేడికి తట్టుకోలేక బయటకు వెళ్లలేక ఇంట్లోనే కూర్చుంటారు.. చల్లగా కూలర్, ఏసీ కింద ఉండటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే ఒకవేళ ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే.. చల్లటి పానీయాలు వెంట తీసుకుని మరీ వెళుతున్నారు. ఇక ఎక్కువ మంది కాటన్ దుస్తులను మాత్రమే వేసుకుంటారు. చాలా మంది మహిళలు రాత్రుళ్ళు వేసుకోనే నైటీలను పగలు కూడా వేసుకుంటారు..
ఎండ వేడిని తట్టుకోవడం కోసం ఆడవాళ్లు ఎక్కువగా నైటీలల్లో కనిపిస్తారు. ఒకప్పుడు కేవలం రాత్రి సమయాల్లో మాత్రమే మహిళలు నిద్ర బాగా పట్టాలని నైటీలు వేసుకునేవారు.. ఇక పండుగా వచ్చిన కూడా పట్టు చీరలకు పని చెప్పకుండా నైటిలల్లోనే దర్శనం ఇస్తూ ట్రెండ్ ను సెట్ చేస్తున్నారు.. ఉదయం స్నానం చేయగానే నైటీ ధరించి దానిపైనే ఇల్లంతా తిరుగుతూ పనులు చేస్తుంటారు. కారణం ఏదైనప్పటికీ ఆడవాళ్లు నైటీ కి ఇచ్చే ప్రాధాన్యత మాత్రం మామూలేదు..
కొంతమంది మహిళలు కాటన్ నైటీలను మాత్రమే కాదు, పాలిస్టర్ నైటీలు వేసుకుంటుంటారు.. అలాంటి వాళ్లు చెమటలు పడ్డా, లేదా చేతులను కడిగిన తర్వాత నైటీలకు మాత్రమే తుడుచుకుంటారు. ఈ విధంగా చెయ్యడం వల్ల మనకు తెలియకుండానే క్రీములు మన శరీరంలోకి వెళ్లి పలు అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయి. అయితే చెమటలు తుడుచుకుంటూ ఉంటే.. బ్యాక్టీరియా ఫామ్ అయి ఇన్ఫెక్షన్స్ వస్తాయి.. అందుకే ఎక్కువగా కాటన్ ను ధరించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఎప్పటికప్పుడు ఉతికిన నైటీలను మాత్రమే వేసుకోవాలని చెబుతున్నారు.. లేకుంటే మాత్రం అందరికీ జబ్బులు వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు..