NTV Telugu Site icon

Suicide Attempt : రెండో భర్త నన్ను వద్దంటున్నాడు.. నేను సచ్చిపోతా..!

Suicide Attempt

Suicide Attempt

తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ మహిళ పెట్రోల్ బాటిల్ తో రోడ్డెక్కిన ఘటన వైఎస్సార్‌ కడప జిల్లాలో చోటు చేసుకుంది. నెలన్నర క్రిందట ప్రేమించి పెళ్లి చేసుకున్న రెండో భర్త తనను వద్దంటున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది సదరు మహిళ. అయితే.. తనకు ఆత్మహత్మ తప్ప మరో గత్యంతరం లేదని కడపకు చెందిన చందన అనే మహిళ కన్నీరు మున్నీరవుతోంది. తన రెండో భర్త హర్ష వంశీ రాజు విషయంలో పంచాయతీ చేసిన రవి కర్రీ పాయింట్ ఓనర్ రవి ఇప్పుడు తనకు తెలియదని చెబుతున్నాడని చందన ఆరోపిస్తోంది.

Also Read : Shraddha Das : దివినుంచి దిగివచ్చిన దేవకన్యలా..!
తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోలేదని చందన ఆవేదన వ్యక్తం చేస్తోంది. అయితే.. మొదటి భర్త శ్రీనివాసులుతో విడాకుల తీసుకుంటున్నానని, అందుకే వంశీ రాజును ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నానని చందన అంటోంది. ఇప్పుడు రెండో భర్త వంశీ రాజు బంధువులు చెప్పిన మాటలు విని, వదిలేస్తే నా పరిస్థితి ఏమిటని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. స్థానికుల సమాచారంతో రవి కర్రీ పాయింట్ వద్ద ఆత్మహత్యకు యత్నించిన చందన వద్ద ఉన్న పెట్రోల్ బాటిల్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

Also Read : Avocado Health Benefits : అవకాడోతో మీ శక్తి రెట్టింపు.. దీని ప్రయోజనాలు తెలిస్తే షాకే..!