Women Health: డెలివరీ తర్వాత ఇలాంటి ఆహారాన్ని తీసుకుంటే తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక బిడ్డకు జన్మనివ్వడం అంటే ఆ తల్లి మరో జన్మ ఎత్తినట్లు.. బిడ్డ కడుపులో పడక ముందు ఎంత ఆరోగ్యంగా ఉంటారో.. బిడ్డ కడుపున పడిన నాటి నుంచి డెలివరీ అయ్యేవరకు ఆడవారి శరీరంలో ఎన్నో మార్పులు కలుగుతాయి..ప్రసవం తర్వాత మహిళలు సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పడుతుంది. డెలివరీ తర్వాత వారిలో శారీరకంగా, మానసికంగా అనేక మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. డెలివరీ టైమ్‌లో రక్తం పోవడం, ఒత్తిడి, మానసిక ఆందోళన… లాంటి కారణాల వల్ల మహిళలు నీరసించి పోతారు. చాలామందిని మలబద్ధకం, మూత్రవిసర్జన సమయంలో మంట వంటి సమస్యలూ ఇబ్బంది పెడతాయి. బరువు పెరగడం, జుట్టు రాలిపోవడం వంటి ప్రాబ్లమ్స్ కామన్.. తల్లి, బిడ్డా ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం.. ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మెంతుల్లో ఐరన్, ఫైబర్, కాల్షియం, విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇవి తల్లికీ బిడ్డకీ కూడా మంచివి. పప్పుల్లో, కూరల్లో కొంచెం మెంతి పొడి వేసుకోవచ్చు. మెంతులతో టీ కూడా చేసుకుని తాగొచ్చు. మెంతులు తల్లి పాలను పెంచుతాయి..
Also Read
- CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
- Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
- CM Chandrababu: నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. అదంతా మీ వల్లే.. ఇది నా పూర్వజన్మ సుకృతం!
- Janthikalu Recipe: ఇంట్లోనే కరకరలాడే జంతికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ పాటించండి
కిచిడి.. దీన్ని అన్నం పప్పుతో తయారు చేస్తారు..డెలివరీ తర్వాత మహిళలు కచ్చితంగా ఇది, వారి డైట్‌లో చేర్చుకుంటే మేలు జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. కిచిడీ, సులభంగా జీర్ణం అవుతుంది. దీనిలో పోషకాలు అధికంగా ఉంటాయి.. పప్పు ప్రోటీన్స్ ను అందిస్తుంది..
ఇక పిల్లలకు పాలిచ్చే తల్లులు ఆహారంలో వాల్‌నట్‌లు, జీడిపప్పు, ఎండుద్రాక్ష, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్‌ను చేర్చుకోవాలి. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బాదంపప్పును ఆహారంలో చేసుకోవాలనుకుంటే రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినాలి. పోషకాలు అధికంగా ఉండే డ్రై ఫ్రూట్స్ శరీరానికి బలాన్ని అందిస్తాయి. ఎన్నో పోషకాలను అందిస్తుంది..
పౌల్ట్రీ, చేపలు, గుడ్లు, డైరీ, బీన్స్, గింజలు, విత్తనాలు వంటి ప్రోటీన్ ఆహారాలను ఆహారంలో చేర్చుకోవాలి. అలాగే ముదురు ఆకుపచ్చ, పసుపు కూరగాయలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజువారీ ఆహారంలో హోల్ వీట్ రొట్టెలు, పాస్తా, తృణధాన్యాలను డైట్ లో భాగం చేసుకోవాలి..
అలాగే అల్లం.. అల్లం జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది, వాపును తగ్గిస్తుంది. అల్లంలో శక్తివంతమై.. యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. అల్లంలో దాదాపు 40 యాంటీ ఆక్సిడెంట్ కాంపౌండ్స్ ఉంటాయి.. కండరాలు టైట్ అవ్వడంలో అల్లం సహాయ పడుతుంది..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు..
తాజావార్తలు
-
Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
-
Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
-
CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు… ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
ట్రెండింగ్
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!