Site icon NTV Telugu

Crime : అందుకు ఒప్పుకోలేదని మహిళను చున్నీతో ఉరివేసి హత్య

Secendrabad Crime

Secendrabad Crime

మాయమాటలు చెప్పి మహిళను లొంగదీసుకోవడానికి ప్రయత్నించగా ఆమె నిరాకరించడంతో చున్నీతో ఆమెను ఉరివేసి చంపేసిన ఘటన బాచుపల్లి పియస్ పరిధిలో చోటుచేసుకుంది. నేపాల్ కు చెందిన కుమార్(22) బాచుపల్లి పియస్ పరిధి ఇందిరానగర్ లోని రుచి హోటల్ లో పనిచేస్తున్నాడు‌. రాత్రి కుమార్ అతని స్నేహితుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పార్సిల్‌ తీసుకొని పక్కనే ఉన్న తన రూమ్ కి వెళ్లారు. బాలానగర్ లో నివాసం ఉండే పూజిత(45) అనే మహిళ పని నిమిత్తం ఇంద్రానగర్ కు చేరుకోగా ఆమెపై కన్నేసిన కుమార్ అతని‌ స్నేహితుడు పూజితకు మాయమాటలు చెప్పి వారి రూమ్ కు తీసుకెళ్లారు.

Also Read : Chandrababu Naidu: చంద్రబాబుకు నిరసన సెగ.. మంత్రి సురేష్ ఫైర్

పూజితను లొంగతీసుకోవడానికి కుమార్ అతని స్నేహితుడు ప్రయత్నించగా ఆమె నిరాకరించడంతో ఆమె మెడకు చున్నీతో ఉరి వేసి హత్యకు పాల్పడ్డారు. అనంతరం వారిద్దరూ పారిపోయారు. ఉదయం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు కుమార్ రాలేదని హోటల్ యజమాని కుమార్ రూమ్ కి వచ్చి చూడగా మహిళా మృతదేహం కనిపించడంతో బాచుపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు కేసు నమోదు చేసుకొని డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం ల సహయంతో దర్యాప్తు చేస్తున్నారు. కుమార్ అతని స్నేహితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read : Peacefull Countries: ప్రపంచంలోని టాప్-10 శాంతియుత దేశాలు

Exit mobile version