NTV Telugu Site icon

Crime News: అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు వివాహిత దారుణ హత్య

Crime News

Crime News

Crime News: వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకుని.. ఆమె వద్దనే 2.5 లక్షల అప్పు తీసుకున్న ఓ వ్యక్తి.. అప్పు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు ఆమెను దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 27 మహిళా అదృశ్యం కేసు నమోదు కాగా.. కాల్‌డేటా ఆధారంగా పోలీసులు విచారణ జరిపారు. ఎట్టకేలకు నిందితుడు తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా పాలమాకుల గ్రామంలో చోటుచేసుకుంది.

Read Also: Bengaluru: అగ్నిగుండాన్ని తలపిస్తున్న బెంగళూర్ నగరం.. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు..

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకుల గ్రామానికి చెందిన గుడెపు యాదమ్మ గత నెల 27న శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి రాళ్లగూడలోని బంధువుల ఇంటికి వెళుతునట్లు ఇంట్లో వాళ్ళకు చెప్పి వెళ్ళింది. అయితే అదేరోజు చీకటి పడిన అమె తిరిగి ఇంటికి రాలేదు. బంధువులకు ఫోన్ చేసిన ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న శంషాబాద్ పోలీసులు.. ఆమె వాడిన ఫోన్ ద్వారా దర్యాప్తు చేపట్టారు. యాదమ్మ చివరి ఫోన్ కాల్ ఎవరితో మాట్లాడింది అనే విచారించగా సంఘిగూడ గ్రామానికి చెందిన శంకరయ్యగా తేలింది. అయితే ఈ నెల 5వ తేదీన శంకరయ్యను శంషాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ మొదలుపెట్టారు. దీంతో శంకరయ్య యాదమ్మను పెద్దషాపూర్ బస్టాండ్ వద్ద బైక్ పై ఎక్కించుకుని సంఘిగూడలోని తన పొలానికి తీసుకెళ్ళానని చెప్పాడు. పొలం వద్దకు చేరుకున్న ఇద్దరికి అప్పటికే వివాహేతర సంబంధం ఉన్నట్లు అదే చనువుతో యాదమ్మ వద్ద శంకరయ్య 2.5 లక్షలు అప్పు తీసుకున్నాడు. అయితే పొలం వద్ద ఇద్దరి మద్య డబ్బుల విషయంలో వాగ్వాదం జరిగింది. దీంతో కోపానికి గురైన శంకరయ్య బండరాయితో అమె తలపై బలంగా కొట్టాడు. దీంతో అమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అయితే భయబ్రాంతులకు గురైన శంకరయ్య ఏం చేయాలో తెలియక తన వద్ద ఉన్న జేసీబీ సహాయంతో పొలంలోనే గొయ్యి తవ్వి యాదమ్మ మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు స్థానిక ఎమ్మార్వో నాగమణి సమక్షంలో మృతదేహాన్ని వెలికి తీయించి అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.