Viral Video: మాజీ సీఎం సిద్ధరామయ్యకు చేదు అనుభవం.. డబ్బులు విసిరికొట్టిన మహిళ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఊహించని చేదు అనుభవం ఎదురైంది. కెరూర్ అల్లర్లలో గాయపడిన వారికి సిద్ధరామయ్య సాయం చేస్తుండగా ఒక మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.2లక్షల నష్టపరిహారాన్ని ఆయనపై విసిరి పడేసింది. మీరిచ్చే డబ్బులు అవసరం లేదంటూ విసిరికొట్టింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియా చక్కర్లు కొడుతోంది.
బాగల్కోట్ జిల్లాలోని కెరూర్‌లో ఈ నెల 6న హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. యాసిన్ అనే వ్యక్తి.. ఓ వర్గానికి చెందిన యువతిని వేధిస్తున్నాడన్న విషయంలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో హిందూ జాగరణ వేదిక కార్యకర్తలు ఘర్షణకు దిగారు. దీంతో, యాసిన్ తన అనుచరులతో కలిసి వారిపై దాడి చేశాడు. దీంతో హింస చెలరేగింది. ఈ ఘటనలో నలుగురు యువకులు గాయపడ్డారు. పోలీసులు రెండు వర్గాలకు సంబంధించిన 20 మందిని అరెస్ట్ చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా 144 సెక్షన్ విధించారు. ఈ నేపథ్యంలో గాయపడిన బాధితులను పరామర్శించేందుకు సిద్ధరామయ్య శుక్రవారం ఆస్పత్రికి వెళ్లారు. బాధిత నాలుగు కుటుంబాలకు రూ.50 వేల చొప్పున 2లక్షలు అందించి బయటకు వచ్చారు.
Also Read
- CM CBN Reviews on Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
- Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు..!
- Import Duty Cuts on Edible Oils: పండుగలకు ముందే ఊరట.. వంట నూనెలపై గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం..
- 144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
Skill Makthal: టీహబ్ వేదికగా ‘స్కిల్ మఖ్తల్’ లోగో ఆవిష్కరణ
అక్కడ గాయపడ్డ వ్యక్తి కుటుంబానికి సంబంధించిన ఓ మహిళ ఆయన కారు ఎక్కుతుండగా ఆ డబ్బులను ఎస్కార్ట్ వాహనంపైకి విసిరేసింది. ‘మాకు డబ్బు అవసరం లేదు.. న్యాయం కావాలి.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించి హింసకు పాల్పడే దుండగులను శిక్షించాలి.. సమాజంలో శాంతి నెలకొనాలి’ అంటూ సిద్ధరామయ్య వాహనంపై డబ్బులు విసిరేసిన మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. హిందువులైనా, ముస్లింలైనా అందర్ని సమానంగా చూడాలంటూ వాపోయింది. రాజకీయ నాయకుల ఓదార్పు అవసరం లేదని , ప్రశాంతంగా ఉండనివ్వాలని ఆ మహిళ నినాదాలు చేసింది. ఏ తప్పు చేయకపోయినా.. కారణం లేకుండా తమ వారిపై దాడి చేశారని బోరుమంది. గాయపడ్డ వారు ఏడాది పాటు విశ్రాంతి తీసుకోవాలని.. డబ్బు తమ సమస్యకు పరిష్కారం కాదని పేర్కొంది. భిక్షాటన చేసి అయినా తన కుటుంబాన్ని పోషించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది.
#Karnataka -Compensation money which was given by @siddaramaiah was thrown back at him by the family of victims. #Siddaramaih gave 2lakh rupees for the injured when visited them.
Their demand is not the money but to maintain law and order situation and arrest the culprits. pic.twitter.com/lsLcylbpXf— Siraj Noorani (@sirajnoorani) July 15, 2022
తాజావార్తలు
-
Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
CM CBN Reviews on Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
-
MIVI ONE 5G: మివి వన్ 5G భారత్‌లో లాంచ్.. Snapdragon 4 Gen 2, 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు..!
-
Harassment: మారండ్రా బాబు.. మరో దారుణం.. రోడ్డుపై మైనర్ బాలికపై వేధింపులు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!