Site icon NTV Telugu

Siddipet Crime: దారుణం.. మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ ఆటో డ్రైవర్

Rape

Rape

Siddipet Crime: మహిళల భద్రతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున వాదనలు చేస్తున్నాయి. అయినప్పటికీ, మహిళలపై అత్యాచారాలు, వేధింపుల ఘటనలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. మహిళపై ఆటోడ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వట్టిపల్లి నుంచి సాల్వపూర్‌కి మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా ఆటో రావడంతో మహిళ ఎక్కి కూర్చుంది. ఆటో డ్రైవర్‌ అదే అదనుగా భావించాడు. గ్రామ సమీపంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి డ్రైవర్ నర్సింహులు ఆ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అనంతరం బాధితురాలు జగదేవ్‌పూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Read Also: Tirupati Crime: అసిస్టెంట్‌ బ్యాంక్‌ మేనేజర్‌ అనుమానాస్పద మృతి

Exit mobile version