NTV Telugu Site icon

Reel in Police Station: కత్తితో పోలీస్ స్టేషన్‌లో రీల్ చేసిన మహిళ.. తర్వాత ఏమైందంటే?

Reels

Reels

ప్రస్తుతం ఎంతో మంది తక్కువ సమయంలోనే సోషల్‌ మీడియాలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునేందుకు ఆరాటపడుతున్నారు. అందుకోసం ప్రమాదకర స్టంట్‌లు చేస్తూ.. లైకుల కోసం ప్రాణాలకు తెగిస్తున్నారు. ఫాలోవర్స్ మోజులో కొందరు యువకులు డేంజరస్ స్టంట్స్ చేస్తున్నారు. ప్రాణాలతో చెలగాడం ఆడుతున్నారు. ఈ మధ్య ఇలా పిచ్చి పైత్యపు పనులు చేసి చాలామంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ మహిళ లైక్స్ కోసం ఏకంగా పోలీస్ స్టేషన్‌ బయట కత్తితో రీల్‌ చేసింది. దాన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. వైరల్ గా మారింది.

READ MORE: Tailors: మహిళల కొలతలు మగవారు తీసుకోవద్దు.. మహిళా కమిషన్ ప్రతిపాదన!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో లక్నోకి చెందినది. ఇందులో ఓ మహిళ పోలీసు స్టేషన్‌ వెలుపల కత్తితో వీడియో తీస్తోంది. ఆ మహిళ పోలీసు స్టేషన్‌ నుంచి కత్తితో బయటకు వస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. వీడియోలో కనిపిస్తున్న మహిళ పేరు హిమాన్షి యాదవ్. ఆమె లక్నోలోని పరా హన్స్ ఖేడా చౌకీ నివాసి. ఈ వీడియో హిమాన్షి యాదవ్ ప్రొఫైల్ నుంచి అప్‌లోడ్ చేయబడింది. ప్రస్తుతం పోలీసులు వీడియో ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఆమెను పట్టుకుని విచారిస్తామని తెలిపారు.

READ MORE:Seaplane: శ్రీశైలంలో సేఫ్‌గా ల్యాండ్ అయిన సీ ప్లేన్.. ట్రయల్‌ రన్‌ విజయవంతం..

అయితే ఈ రకమైన రీల్స్‌పై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇలాంటి ఘటన స్టేషన్‌లోనే జరగడంపై జనాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. వీడియోలు తీస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆ మహిళ స్టేషన్‌కు కత్తి ఎలా తీసుకొచ్చింది? పోలీసులు వీడియో తీయడానికి ఎలా అనుమతి ఇచ్చారు? ఆ వీడియోను సోషల్ మీడియాలో అంత దర్జాగా ఎలా పోస్ట్ చేశారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

Show comments