Site icon NTV Telugu

Ujjain: మహిళకు బలవంతంగా మద్యం తాగించి రోడ్డుపై అత్యాచారం.. వీడియో వైరల్

Rape Case

Rape Case

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళకు బలవంతంగా మద్యం తాగించి రోడ్డు పక్కన అత్యాచారం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో బుధవారం సాయంత్రం నాటిదని చెబుతున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువకుడు మహిళతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న దృశ్యం కనిపిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అరెస్ట్ చేశారు.

Read Also: Weather Alert: ఏపీకి మరోసారి వానగండం.. భారీ వర్షాలు కురిసే అవకాశం

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వివరాలు వెల్లడించారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి యువతికి మద్యం తాగించి, అత్యాచారం చేసి, బెదిరించి పారిపోయే ప్రయత్నం చేశాడని పోలీసులు చెబుతున్నారు. ఈ వీడియో పోలీసుల దృష్టికి రావడంతో బాధిత మహిళను పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. దీంతో.. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. యువకుడు తనను మద్యం షాపు దగ్గర కలుసుకుని పెళ్లి కోసం తీసుకొచ్చాడని, ఆ తర్వాత.. అత్యాచారం చేసి బెదిరించి పారిపోయాడని బాధిత మహిళ తెలిపింది. మహిళ వాంగ్మూలాన్ని నమోదు చేసి వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Read Also: Fake Baba: ఇంట్లో దెయ్యం ఉందని.. పూజల పేరుతో 29 లక్షలు కాజేసిన కేటుగాళ్లు

ఈ ఘటనపై కొత్వాలి సీఎస్పీ ఓంప్రకాష్ మిశ్రా మాట్లాడుతూ.. ఉజ్జయినిలోని కోయిలా ఫటక్ మద్యం దుకాణం దగ్గర అత్యాచార ఘటనకు సంబంధించిన వీడియో లభ్యమైందని తెలిపారు. ఈ వీడియోను గుర్తించి.. మహిళను పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి, మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై వెంటనే చర్యలు తీసుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుడు ఎప్పుడూ ఆ మహిళ వెంటే ఉంటానని చెప్పాడని పోలీసులు తెలిపారు. అయితే అత్యాచారం చేసిన అనంతరం యువకుడు బెదిరించి అక్కడి నుంచి పారిపోయాడని.. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేశామని పేర్కొన్నారు.

Exit mobile version