Viral News: భయపెట్టిన నైటీ.. ఇలా ఎవరైనా చేస్తారా అంటూ గగ్గోలు పెట్టిన మహిళ
రాత్రి పూట మనం ఎప్పుడూ చూసే ప్రదేశాలను చూసిన మనకు అప్పుడప్పుడు భయమేస్తూ ఉంటుంది. చీకటిలో వస్తువుల నీడలు వేరేలాగా కనిపిస్తూ ఉంటాయి. వాటిని నిశితంగా పరిశీలిస్తే కానీ అసలు విషయం తెలియదు. అయితే అసలు విషయం తెలుసుకునే ప్రయత్నం కాదు కదా అలా అనుమానంగా ఏదైనా కనిపిస్తే వెంటనే ఇంట్లోకి పరిగెత్తుకెళ్లి దుప్పటి ముసుగేసుకొని వణుకుతు పడుకుంటాం. సరిగ్గా అలాగే జరిగింది ఓ మహిళకు. విషయం మొత్తాన్ని తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఆమెకు ఎలా ఉన్నా కూడా ఇది విన్న వారు పగలబడి నవ్వుకుంటున్నారు. భలే విషయానికి భయపడ్డావే అంటూ కామెంట్ చేస్తున్నారు. కొంతమంది తమకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందంటూ చెప్పుకొస్తున్నారు.
Also Read: Mother Murder: రాత్రి సమయంలో తల్లి చేతిలో ఫోన్.. ఆ కొడుకు ఏం చేశాడంటే?
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
అసలు విషయం ఏంటంటే…రాత్రి పూట నిద్రపట్టక ఓ మహిళ బాల్కనీలోకి వచ్చింది. అటూ ఇటూ తిరుగుతూ తమ ఎదురుగా ఉండే ఒక ఇంటివైపు చూసింది. అక్కడ ఏదో వేలాడుతున్నట్లు కనిపించింది. దూరం నుంచి చూస్తే అది ఒక అమ్మాయిలాగా అనిపించింది. అంతేకాదు అది గాలికి అటు ఇటు ఊగుతూ కనిపించింది. దాంతో ఒక్కసారిగా ఆమె మైండ్ బ్లాంక్ అయ్యింది. దానిని చూసి ఆమె దెయ్యం అనుకుంది. ఇంకేముంది భయంతో ఇంట్లోకి పరుగెత్తుకుంటూ వచ్చి తలుపులు వేసుకుంది. తెల్లార్లు బిక్కుబిక్కుమంటూ గడిపింది. తెల్లారాక ధైర్యం చేసి అదేంటో తెలుసుకోవాలనుకుంది. నెమ్మదిగా వచ్చి ఆ ఇంటివైపు చూసి షాక్ తింది. దీనికా నేనే భయపడింది అనుకుంది. ఇంతకీ ఆమె ఆ రాత్రి చూసింది ఒక నైటీని. అది గాలిలో తీగలపై వేలాడుతూ ఉంది. చీకటిలో కనిపించకపోయే సరికి దానిని దెయ్యం అనుకుంది. ఇక ఇదే విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ ఇలా ఎవరైనా ఆరేస్తారా? భయంతో రాత్రంతా చచ్చా.. పదిసార్లు హనుమాన్ చాలీసా చదువుకున్నా అని తెలిపింది. ఇది చూసిన వారందరూ ఆమెను ఓ నైటీ భయపెట్టిందని నవ్వుకుంటున్నారు. అయితే ఇది ఎక్కడ జరిగిందో వివరాలు మాత్రం తెలియదు. రాత్రిపూట ఇలాంటివి జరగడం కామన్ అయినా రాత్రంతా ఎలా గడిపావో అంటూ చాలా మంది కామెంట్ చేస్తున్నారు.
- Tags
- Nighty
- SPIRIT
- viral news
- Woman
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!