Son Murders Mother In Maharashtra: అనుమానం మనిషి చేత ఎంత ఘోరానైనా చేయిస్తుంది. అనుమానంతో ఉన్నప్పుడు, అవేశంతో రగిలిపోతున్నప్పుడు మనం ఏం చేస్తున్నామో మనకే అర్థం కాదు. ఆ సమయంలో మనం ఎంతటి దారుణానికి ఒడిగట్టడానికైనా వెనకాడం. సొంత వారన్న కనికరం లేకుండా వారిపై దాడి చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. సాధారణంగా భార్యను అనుమానించే భర్త ఉంటాడు కానీ అమ్మను అనుమానించే బిడ్డలు ఉండరు. అమ్మ అంటే దైవం. ఆమెను పల్లేత్తి మాట అంటేనే మహాపాపం అలాంటిది ఓ కొడుకు తన తల్లినే అనుమానంతో గొడ్డలితో నరికి చంపి రాక్షసుడిలా మారాడు. మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Also Read: Ram Charan: గేమ్ ఛేంజర్ షూటింగ్ లో అసలు సెక్యూరిటీ లేరా? ఈ లీకులేంటి?
వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్రలోనిపాల్ఘర్ జిల్లా వసాయ్ టౌన్‌షిప్ పరిధి పెరోల్ ప్రాంతంలో సోనాలి గోగ్రా అనే 35 యేళ్ల మహిళ తన 17యేళ్ల కొడుకుతో కలిసి ఉంటుంది. తండ్రి లేకపోవడం వల్ల ఆ మహిళే కొడుకును పెంచి పోషిస్తోంది. ఇక దారుణం జరిగిన రోజు రాత్రి 10 గంటల సమయంలో కొడుకు అన్నం పెట్టింది ఆ తల్లి. తరువాత పక్కకు వెళ్లి తన ఫోన్ లో ఎవరికో మెసేజ్ చేసింది. ఇది చూసి ఆ కొడుకు ఒక్కసారిగా కోపంతో ఊగిపోతూ పశువుల ప్రవర్తించాడు. తన తల్లితో ఈ సమయంలో ఎవరికి మెసేజ్ చేస్తున్నావని గొడవ పడ్డాడు. ఆమెను ఇష్టం వచ్చినట్లు తిట్టాడు. అంతటితో ఆగకుండా ఆ కొడుకు తల్లి పట్ల ఏ కొడుకు ప్రవర్తించని విధంగా చేశాడు. కోపంలో ఉన్న అతను ఆవేశంతో తన పక్కన ఉన్న గొడ్డలి తీసుకొని తల్లిని నరికాడు. దీంతో ఆమె గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చి ఆసుపత్రిలో చేర్పించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. అయితే తన తల్లికి ఎవరితోనో అక్రమ సంబంధం ఉందని ఆమె కొడుకు తరచూ అనుమానించేవాడని, ఈ విషయంపై ఇద్దరు గొడవపడుతూ ఉండేవారని స్థానికులు తెలిపారు. ఈ విషయం తెలిసిన పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించారు. అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.