Site icon NTV Telugu

Delhi: దారుణం.. భర్త ప్రైవేట్ పార్ట్ కోసి భార్య పరారీ

Crime

Crime

ఢిల్లీలో ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. గొడవల కారణంగా ఓ భార్య తన భర్త ప్రైవేట్ పార్ట్ కోసి పారిపోయింది. దీంతో భర్త పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స కొనసాగిస్తున్నారు. అయితే ఈ నేరానికి పాల్పడడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

READ MORE: Jammu Kashmir: లోయలో పడ్డ కారు.. 10 నెలల బాలుడితో సహా ముగ్గురు మృతి

ఈ ఘటన ఉత్తర ఢిల్లీలోని రూప్ నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నవంబర్ 1వ తేదీన ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేశాడు. తన భార్య తన ప్రైవేట్ పార్ట్ కోసి పారిపోయినట్లు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రుడిని సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉంది. కానీ అతను కోలుకోగానే రాతపూర్వక ఫిర్యాదును స్వీకరించేందుకు పోలీసులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అతని భార్య పరారీలో ఉందని, ఆ వ్యక్తి వాంగ్మూలం, రాతపూర్వక ఫిర్యాదు మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. పరారీలో ఉన్న మహిళ కోసం గాలిస్తున్నారు.

READ MORE:CM Chandrababu: 2 గంటల్లోనే విశాఖ నుండి అమరావతికి..

Exit mobile version