NTV Telugu Site icon

Viral Video: చూడకుండానే హనుమాన్ చిత్రాన్ని గీసిన మహిళ.. వీడియో వైరల్..!

Art

Art

Viral Video: ప్రపంచంలో కళాకారులు బోలెడంత మంది మంది ఉన్నారు. వారి కళాత్మకతతో, నైపుణ్యంతో ప్రజలను మెప్పించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అయితే పల్లెటూర్లలో కళాకారులు లేరని.. అందులో మహిళల్లో కళా నైపుణ్యాలు లేవని కొందరు అంటూంటారు. అయితే ఈ వీడియోలో చూస్తే.. ఆ మహిళ వేసిన చిత్రానికి అందరూ అవాక్కువుతున్నారు. అటువంటి నైపుణ్యం కలిగిన ఓ మహిళ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో చిత్రాన్ని చూసి మీరు ఆమెను ప్రశంసించకుండా ఉండరు. ఎందుకంటే ఆమె అంత అద్భుతంగా చిత్రాన్ని రూపొందించింది.

PM Modi Tour: మోడీ పర్యటనపై సీపీ రంగనాథ్.. మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశాం

వీడియోలో ఓ మహిళ చూడకుండానే హనుమంతుని చిత్రాన్ని గీస్తుంది. రెండు చేతుల్లో సుద్దను పట్టుకుని, చేతులు వెనక్కు తిప్పకుండా బ్లాక్ బోర్డ్‌పై చిత్రాన్ని గీస్తున్నది వీడియోలో చూడవచ్చు. అయితే ఆ మహిళ చూపిన కళానైపుణ్యానికి నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు. ఈ అద్భుతమైన వీడియోను ఇప్పటివరకు 10 లక్షల సార్లు వీక్షించారు. 1 లక్ష 33 వేల మందికి పైగా వీడియోను లైక్ చేసారు. అంతేకాకుండా కామెంట్స్ కూడా చేస్తున్నారు.

Falaknuma Express: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ మంటలు.. అసలు కారణం ఏంటి..?

‘ఆప్కీ కలకారీ కో సెల్యూట్ హై ఆంటీ’ అని కొందరు, ఇది అద్భుతమైన ప్రతిభ అని కొందరు అంటున్నారు. అదే సమయంలో కొంతమంది నెటిజన్లు మహిళ ముందు అద్దం ఉందని.. అందులో చూస్తూ చిత్రాన్ని గీస్తుందని చెబుతున్నారు. అయితే ఆమె అద్దంలో చూసుకుని చిత్రాన్ని రూపొందిస్తున్నప్పటికీ, రెండు చేతులను వెనుకకు ఉంచి ఆర్ట్‌వర్క్ చేయడం అంత సులభం కాదని ఒక వినియోగదారు రాశారు.