NTV Telugu Site icon

Suresh Raina: సూర్యకుమార్ యాదవ్ లేకుండా మూడు ఫార్మాట్లూ ఉండవు..

Surya Kumar Yadav

Surya Kumar Yadav

Suresh Raina: టీమిండియా స్టార్‌ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ టీ20లు, వన్డేల్లో సత్తా చాటాడని.. తర్వాత టెస్టుల్లో పాల్గొనాల్సిన అవసరం ఉందని మాజీ క్రికెటర్ సురేష్ రైనా అభిప్రాయపడ్డాడు. ఈ స్టార్ బ్యాటర్ లేకుండా మూడు ఫార్మాట్లూ ఉండవని అన్నాడు. టెస్టుల్లోనూ అతనికి అవకాశం ఇవ్వాలని, ఎన్నో సెంచరీలు బాదగలడని రైనా అభిప్రాయపడ్డాడు. టీ20 ఫార్మాట్‌లో మునుపెన్నడూ లేని విధంగా, రికార్డులు నెలకొల్పి సూర్యకుమార్ యాదవ్ అద్భుత ప్రతిభను ప్రదర్శించాడు. టీ20లలో ఒక క్యాలెండర్ సంవత్సరంలో 1000 కంటే ఎక్కువ పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. 187.43 అద్భుత స్ట్రైక్ రేట్‌తో 1164 పరుగులను సాధించి, అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఘనతను సాధించాడు.

సూర్యకుమార్ ప్రదర్శన చూస్తుంటే.. తను మూడు ఫార్మాట్లలో ఆడాలని తాను అనుకుంటున్నట్లు సురేష్ రైనా అభిప్రాయపడ్డారు. సూర్య లేకుండా మూడు ఫార్మాట్లు ఉండకూడదన్నారు. ఫామ్‌లో ఉన్న సర్ఫరాజ్ ఖాన్ బదులు సూర్య కుమార్‌ యాదవ్‌కు చోటివ్వడమేంటన్న విమర్శలు కూడా వచ్చాయి. గతేడాది టీ20ల్లో వెయ్యికిపైగా రన్స్ చేసినా.. టెస్టుల్లో అతడు ఏ మేరకు రాణిస్తాడన్న సందేహాలు ఉన్నాయి. అయితే సూర్య టెస్టుల్లోనూ రాణిస్తాడని అన్నాడు మాజీ క్రికెటర్ సురేశ్ రైనా. అంతేకాదు అసలు అతడు లేకపోతే మూడు ఫార్మాట్లూ ఉండవని అనడం గమనార్హం. అతని ఆటతీరు సంకల్పం, వివిధ షాట్లు ఆడే తీరుతో పాటు భయం లేకుండా ఆడతాడని రైనా అన్నాడు. మైదానాన్ని ఎలా వినియోగించుకోవాలో తనకు తెలుసన్నారు.

Shahrukh Khan: లేడీ గెటప్‌లో షారుఖ్.. స్ట్రాంగ్ కౌంటరిచ్చిన కింగ్ ఖాన్

ఏడాది కాలంగా ఇండియన్ క్రికెట్‌లో సూర్యకుమార్ పేరు మార్మోగుతోంది. ప్రస్తుతానికి టీ20 ఫార్మాట్ లో అతనికి తిరుగు లేకపోయినా.. వన్డే క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నాడు. ఇక వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరగబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం టెస్టు టీమ్ లోనూ సూర్యకుమార్‌కు చోటు దక్కింది.

ఇదే చర్చలో సురేష్ రైనాతో కలిసి పాల్గొన్న మరో మాజీ క్రికెటర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా కూడా రైనా వ్యాఖ్యలతో ఏకీభవించాడు. సూర్యకుమార్ యాదవ్ ముంబై ప్లేయర్ అని.. రెడ్ బాల్‌ క్రికెట్‌ ఎలా ఆడాలో అతనికి తెలుసన్నాడు. అతనికిది గొప్ప అవకాశమని ఓజా పేర్కొన్నాడు. టెస్ట్ క్రికెట్‌ ఆడటం వల్ల వన్డే టీమ్‌లోనూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోగలడని వెల్లడించాడు. ఇంకా ఎన్నో శతకాలు, ద్విశతకాలు బాధగలడన్నాడు. కచ్చితంగా అతడు టెస్ట్‌ టీమ్‌లోనూ ఉండాలన్నాడు. సూర్య ఆడిన తీరు చూస్తే అతడు మూడు ఫార్మాట్లలోనూ ఉండాలన్న ఓజా.. ఈ ప్రశ్న ఎందుకు వస్తుందో నాకు తెలుసన్నాడు. సర్ఫరాజ్ ఖాన్ ఆడుతున్న తీరు చూస్తే అదే అనిపిస్తుందని… కానీ అతనికి కూడా టైమ్ వస్తుందన్నాడు. సూర్య టెస్టు టీమ్‌లో ఉండటానికి 100 శాతం అర్హుడని అని ఓజా స్పష్టం చేశాడు.