NTV Telugu Site icon

Bhatti Vikramarka: ప్రధాని మోడీ, అమిత్ షాతో సీఎం రేవంత్ చర్చలు.. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై వినతిపత్రం

Bhatti

Bhatti

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురువారం న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, సింగరేణి బొగ్గు గనులు, పెండింగ్ లో ఉన్న విభజన హామీలు, రక్షణ శాఖ భూముల బదిలీతో పాటు మొత్తం 12 అంశాలపై వినతి పత్రాలు అందించారు.

Hemant Soren: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణం

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి, విభజన చట్టం అంశాలపై ప్రధాని మోడీ, అమిత్ షాకి విజ్ఞాపనలు ఇచ్చామని తెలిపారు. అలాగే.. గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న సింగరేణి కోల్ బ్లాక్స్ వేలం లేకుండా ఇవ్వాలని కోరామన్నారు. తెలంగాణకు ఒక ఐఐఎం ఇవ్వాలని కోరామని.. ఐటీఐఆర్ ప్రాజెక్ట్, తెలంగాణలో సెమి కండక్టర్ ప్లాంట్ ఏర్పాటు, ప్రతి జిల్లాకు నవోదయ విద్యాలయం ఇవ్వాలని కోరామన్నారు. అంతేకాకుండా.. కస్తూర్బా విద్యాలయాలు, రక్షణ శాఖ భూములను కోరామన్నారు.

PM Modi: వచ్చే వారం రష్యా, ఆస్ట్రియా దేశాల్లో పర్యటించనున్న ప్రధాని మోడీ

విభజన చట్టం షెడ్యూల్ 9,10 అపరిష్కృతంగా ఉన్న అంశాలను వెంటనే పరిష్కారం చూపాలని కోరామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయాలని, రీజనల్ రింగ్ రోడ్ కు ఒకే నంబర్ ఇవ్వాలని ప్రధానిని కోరామని చెప్పారు. రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా తయారు చేయాలన్నది తమ లక్ష్యమని పేర్కొన్నారు. అంతేకాకుండా.. భద్రాచలం నియోజకవర్గంలోని 5 గ్రామాలు తెలంగాణలో కలపాలని కోరామన్నారు. సాధ్యమైనంత వరకు అన్ని అంశాలను పరిష్కరిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని భట్టి విక్రమార్క చెప్పారు. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ సాధించడం కోసం తమ ప్రయత్నం చేస్తున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు.