Wings India 2024: బేగంపేట ఎయిర్ పోర్ట్‌లో ‘ఇంటర్నేషనల్ వింగ్స్ ఇండియా 2024’ ప్రదర్శన ప్రారంభం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బేగంపేట ఎయిర్ పోర్ట్‌లో ‘ఇంటర్నేషనల్ వింగ్స్ ఇండియా 2024’ వైమానిక ప్రదర్శన ప్రారంభం అయింది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆరంభించారు. ఈ ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఏవియేషన్ రంగనిపుణులు పాల్గొన్నారు. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు వింగ్స్ ఇండియా 2024 జరగనుంది.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ… హైదరాబాద్‌లో వింగ్స్ ఇండియా 2024 ప్రదర్శన నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ‘వింగ్స్ ఇండియా కార్యక్రమానికి ఆతిథ్యం ఇస్తున్నదుకు సంతోషంగా ఉంది. తెలంగాణలో ఏవియేషన్ రంగానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ దేశంలోనే ఎంతో అభివృద్ధి చెందుతోంది. హైదరాబాద్ నుంచి అమెరికాకు నేరుగా వారంలో మూడు సార్లు విమానం వేయాలని జ్యోతిరాదిత్య సింధియాను కోరాను. ఎయిర్ అంబులెన్స్ లు ఎక్కువగా హైదరాబాద్ వస్తున్నాయి. ఏరో స్పేస్ పెట్టుబడులకు హైదరాబాద్ ఎంతో అనుకూలం. డ్రోన్ పైలట్లకు ఎక్కువగా శిక్షణ ఇచ్చి.. వ్యవసాయం, అత్యవసర పరిస్థితులు, శాంతిభద్రతల్లో డ్రోన్లు వినియోగిస్తున్నాం’ అని కోమటిరెడ్డి తెలిపారు.
Also Read
Also Read: Tammineni Veerabhadram: తమ్మినేని వీరభద్రంను పరామర్శించిన డిప్యూటీ సీఎం!
వింగ్స్ ఇండియా ప్రదర్శన కోసం పలు విమానాలు ఇప్పటికే బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నాయి. మొత్తం 25 రకాల విమానాల ప్రదర్శన ఉంటుంది. 106 దేశాల నుంచి 1500 మంది ప్రతినిధుల హాజరయ్యారు. భారత వాయుసేనకు చెందిన సారంగ్ బృందం జనవరి 18 నుంచి 21 వరకు విన్యాసాలు నిర్వహించనుంది. 20, 21వ తేదీల్లో సందర్శకులను అనుమతించనున్నారు. వింగ్స్ ఇండియా టికెట్ రూ. 750గా ఉంది. బుక్‌మైషో యాప్ ద్వారా టికెట్లను కొనుగోలు చేయవచ్చు. మూడేళ్లలోపు పిల్లలకు మాత్రం ఉచితం.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!