Site icon NTV Telugu

Wine Shops Close: మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. మరికొన్ని గంటల్లో వైన్స్‌ బంద్‌..

Wine Shops Close

Wine Shops Close

Wine Shops Close: తెలుగు రాష్ట్రాల్లో రెండు నెలల నుంచి సాగుతున్న ఎన్నికల ప్రచారానికి మరికొన్ని గంటల్లో తెరపడనుంది. సాయంత్రం 6 గంటల నుంచి మైకులు మూగబోనున్నాయి. ఈ నెల 13న తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలు, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానంతో పాటు ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలు.. 25 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం 5 గంటల నుంచి సోమవారం సాయంత్రం పోలింగ్‌ ముగిసే వరకు తెలుగు రాష్ట్రాల్లో 48 గంటల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.

Read Also: Jharkhand : జార్ఖండ్‌లో కుప్పకూలిన ఎన్నికల వేదిక.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

ఎలాంటి లైసెన్సులు ఉన్నప్పటికీ మద్యం అమ్మకాలు చేయడానికి వీల్లేదని ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు రోజు డ్రైడేగా ప్రకటించింది. అలాగే ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్‌ 4న కూడా మద్యం షాపులు మూసివేయనున్నారు. నిబంధనలను అతిక్రమిస్తే మద్యం దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. దీంతో మద్యం ప్రియులు వరుసగా సెలవులు ఉండడంతో ముందు జాగ్రత్త తీసుకుంటున్నారు. తమకు అవసరమైన సరుకును తెచ్చిపెట్టుకుంటున్నారు.

Exit mobile version