హోలీ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. నేటి సాయంత్రం 6 గంటల నుంచి 8వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు, బార్లను మూసివేయనున్నట్లు రాచకొండ సీపీ చౌహన్ తెలిపారు. శాంతిభద్రతలకు భంగం కల్గకుండా షాపులు మూసివేయాలని వైన్స్ నిర్వాహకులను ఆదేశించామని తెలిపారు. మందు తాగి బహిరంగ ప్రదేశాల్లో గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
Also Read : NTR: ఆస్కార్స్… ఎన్టీఆర్ వస్తున్నాడు…
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హోలీ ప్రశాంతంగా జరుపుకునేలా చర్యలు చేపడుతున్నట్లు చౌహన్ స్పష్టం చేశారు. హోలీ సందర్భంగా ప్రతి ఏడాది నగరంలో మద్యం షాపులు ఓపెన్ చేసుకునేందుకు పోలీసులు అనుమతి నిరాకరిస్తారు. ఈ సారి కూడా అలాగే మద్యం షాపులను మూసివేయాల్సిందిగా యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే యజమానులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. నగరంలో హోలీ సెలబ్రేషన్స్ ఘనంగా జరగుతాయి. పబ్లిక్ ప్రదేశాల్లో హోలీ ఆడుతూ ప్రజలు పండుగను జరుపుకుంటారు.
Also Read : Harish Rao : ఎప్పటికీ అమరుల త్యాగాలు గుర్తుంచుకునేలా స్మారక చిహ్నం