Indian 2 :విశ్వ నటుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఇండియన్ 2 ‘ ..,స్టార్ డైరెక్టర్ శంకర్ ‘ఇండియన్ 2’ సినిమాను తెరకెక్కించారు. గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘ఇండియన్’ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో హీరో సిద్దార్థ్ ,కాజల్ అగర్వాల్,రకుల్ ప్రీత్ సింగ్,ప్రియా భవాని శంకర్, ప్రధాన పాత్రలలో నటించారు.అలాగే ఈ సినిమాలో ఎస్ జె సూర్య, బాబీ సింహ, సముద్రఖని ముఖ్య పాత్రలలో నటించనున్నారు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు .
Read Also :Nani : బలగం వేణుకి షాక్ ఇచ్చిన నాని..?
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో చిత్ర యూనిట్ బిజీ గా వుంది.ఈ సినిమాను మేకర్స్ జులై 12 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.దీనితో మేకర్స్ ఇప్పటి నుండే ప్రమోషన్స్ మొదలు పెట్టారు.ఈ సినిమా నుండి మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్,గ్లింప్సె ,సాంగ్స్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసాయి.ఇదిలా ఉంటే నిన్న చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఇండియన్ 2 ఆడియో లాంచ్ గ్రాండ్ గా జరిగింది. అయితే ఈ మూవీలో కమల్ హాసన్ కంటే సిద్ధార్థే ఎక్కువగా కనిపించనున్నారని సమాచారం.సిద్దార్థ్ పాత్రే సినిమా కథని ముందుకు తీసుకువెళ్తుందని తెలుస్తుంది .