Rahul gandhi: ఆ విషయంలో మోడీ బిజీగా ఉన్నారు
- మోడీ సర్కార్‌పై ఎక్స్ వేదికగా రాహుల్ విమర్శలు
- రాజ్యాంగంపై దాడి చేస్తోందని ధ్వజం
- ఎన్డీఏ సర్కార్‌ను కాపాడుకునే పనిలో మోడీ బిజీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోమవారం 18వ పార్లమెంట్ సమావేశాలు ప్రశాంతంగా ముగిశాయి. ప్రొటెం స్పీకర్ భర్తృహరి ఎంపీలచే ప్రమాణం చేయించారు. ఇక ఎంపీలంతా పార్లమెంట్ ఆవరణలో సందడి సందడిగా కనిపించారు. అయితే కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా తొలిరోజే కేంద్రంపై ఆరోపణలు సంధించారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి 15 రోజుల్లోనే పరీక్షల్లో అవకతవకలు, ఉగ్రదాడులు వంటివి చోటుచేసుకున్నాయని.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాత్రం తన ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారని విమర్శించారు. మోడీ సర్కార్.. రాజ్యాంగంపై దాడి చేస్తోందని ధ్వజమెత్తారు. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: AP Crime: బయటకు పొక్కిన గుట్టు.. వదిన, మరిది ఆత్మహత్య..
Also Read
- Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
- Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్‌లో 50% ఉద్యోగాల కోత
- WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
- Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
రాజ్యాంగంపై దాడి ఆమోదయోగ్యం కాదని… రాజ్యాంగాన్ని ఏ శక్తి తాకలేదన్నారు. మేం దానిని కాపాడతామని చెప్పారు. ఈ విషయంలో మా సందేశం ప్రజల వద్దకు చేరుతోందని మీడియాతో రాహుల్ పేర్కొన్నారు. అనంతరం ‘ఎక్స్’ వేదికగా కూడా అదే సందేశాన్న ఇచ్చారు.‘‘అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే రైలు ప్రమాదాలు, కశ్మీర్‌లో ఉగ్రదాడులు, నీట్, యూజీసీ నెట్ పరీక్షల వివాదాలు, పాలు, గ్యాస్, టోల్ ధరల పెంపు, కార్చిచ్చులు, నీటి సంక్షోభం, వడదెబ్బ మరణాల వంటివి చోటుచేసుకున్నాయి’’ అని రాహుల్ ట్వీట్ చేశారు.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: 2.70 లక్షల ఇళ్లను మంజూరు చేయండి.. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు సీఎం రేవంత్ వినతి
ఇంత జరుగుతున్నా.. ప్రధాన మంత్రి మాత్రం తన ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలో బిజీగా ఉన్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. బలమైన ప్రతిపక్షం కేంద్ర సర్కారుపై ఒత్తిడిని కొనసాగిస్తుందని చెప్పారు. ప్రజల తరఫున గొంతుకను వినిపించడంతోపాటు జవాబుదారీతనం లేకుండా ప్రధాని తప్పించుకోవడాన్ని అడ్డుకుంటుందని తెలిపారు. ఇదిలా ఉంటే లోక్‌సభ తొలి సమావేశాల ప్రారంభం వేళ ఇండియా కూటమి నేతలు రాజ్యాంగ ప్రతిని చేతపట్టి లోక్‌సభ ఛాంబర్‌వైపు ప్రదర్శనగా వెళ్లారు.
ఇది కూడా చదవండి: Crime News: రూ.9వేల కోసం బావా బావమరిదిల మధ్య వివాదం.. ఒకరి హత్య, మరో ముగ్గురికి కత్తిపోట్లు
తాజావార్తలు
-
CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
-
Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
-
Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
-
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
-
Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్‌లో 50% ఉద్యోగాల కోత
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!