Site icon NTV Telugu

Punch Prasad : ‘ఫ్యూచర్లో ప్రాబ్లమ్ వస్తే నా కిడ్నీ ఇస్తా’ : ప్రసాద్ భార్య

Punch Prasad

Punch Prasad

Punch Prasad : జబర్ధస్త్ ద్వారా పాపులరైన పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి గురించి దాదాపు చాలామందికి తెలుసు. అతడు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే పంచ్ ప్రసాద్ కిడ్నీ మార్పిడికి సంబంధించి గుడ్ న్యూస్ తెలిసింది. ఆయనకు కిడ్నీ ఇచ్చేందుకు దాత దొరికినట్లు సమాచారం. ప్రసాద్ తన రెండు కిడ్నీలు పాడవడంతో రెండేళ్లుగా డయాలిసిస్ తో నెట్టుకొస్తున్నాడు. తన సమస్యకు పూర్తి పరిష్కారం దొరకాలంటే కిడ్నీ మార్పిడినే పరిష్కారం. ఈ నేపథ్యంలోనే రెండేళ్ల కిందట జీవన్‌దాన్‌లో కిడ్నీ కోసం ప్రసాద్ అప్లయ్ చేశాడు. అయితే ఇప్పటికి కిడ్నీ దొరికిందని ప్రసాద్ భార్య తన యూట్యూబ్ చానెల్‌ ద్వారా వివరించారు. ట్రాన్స్ ప్లాంటేష్ ప్రాసెస్ నడుస్తోందన్నారు.

Read Also: Sudan Crisis: సూడాన్ సంక్షోభం.. రంజాన్ సందర్భంగా మూడు రోజులు కాల్పుల విరమణ

రెండేళ్ల కిందటే తాము కిడ్నీ కోసం అప్లయ్ చేసినప్పటికీ.. కమ్యూనికేషన్ సరిగా లేకపోవడం వల్ల రెండు మూడుసార్లు వచ్చిన అవకాశాలను మిస్ చేసుకున్నట్లు ఆమె తెలిపింది. ఇన్‌ఫెక్షన్స్, థైరాయిడ్ ఇతరత్రా ఆరోగ్య సమస్యలు పోవాలంటే ట్రాన్స్‌ప్లాంటేషన్‌ మాత్రమే మార్గమని అందుకు.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వివరించారు. నిజానికి తన కిడ్నీనే ఇద్దామనుకున్నారట… కానీ ప్రసాద్‌ ది తక్కువ వయసే కాబట్టి డాక్టర్ల సూచన మేరకు దాతల కోసం ట్రై చేశామని ఆమె చెప్పుకొచ్చారు. మళ్లీ భవిష్యతులో ఏదైనా ప్రాబ్లెమ్ వస్తే అప్పుడు తన కిడ్నీ ఇస్తానని చెప్పారు. ప్రస్తుతం టెస్టు్లన్నీ పూర్తయ్యాకే కిడ్నీ మార్పిడి జరుగుతుందన్నారు. ఇక ప్రసాద్ రీసెంట్‌గా ‘శ్రీదేవి డ్రామా కంపెనీలో’ .. నడవడానికి చాలా కష్టపడుతూ కనిపించాడు. అతడికి తర్వలోనే కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగి ఆరోగ్యంగా ఉండాలని బుల్లితెర ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

Read Also: Raviteja: కొత్త కారుకు ఫ్యాన్సీ నంబర్ కోసం రవితేజ ఎంత ఖర్చుచేశారో తెలుసా ?

Exit mobile version