ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్‌లో ఒక మహిళ పెళ్లి రోజు రాత్రి తన భర్తను చూసి ఆశ్చర్యపోయింది. తన భర్త నపుంసకుడు అని ఆరోపిస్తోంది. తన అత్తమామలు కట్నం కోసం నపుంసకుడితో తనకు వివాహం చేశారని ఆరోపిస్తోంది. ఈ విషయాన్ని తన అత్తామామలకు చెబితే కొట్టి చంపడానికి ప్రయత్నించారని తెలిపింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త, మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
READ MORE: AP Cabinet: రేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ!
కాన్పూర్‌లోని రావత్‌పూర్‌కు చెందిన ఓ యువతి దాదాపు ఏడాది క్రితం 2024 మార్చిలో ఉన్నావ్‌కు చెందిన ఓ యువకుడిని వివాహం చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. తన భర్త నపుంసకుడు అని పెళ్లి రోజు రాత్రి తనకు తెలిసిందని ఆమె చెప్పింది. ఉదయం.. ఈ విషయాన్ని తన వదినకు చెబితే.. ఆమె జోక్‌గా తీసుకుంది. కొన్ని రోజుల తర్వాత ఆమె మరోసారి తన బావ, వదినతో దీని గురించి చర్చించింది. దీంతో అత్తమామలు ఆమెను వేధించడం ప్రారంభించారు. వారికి అన్నీ తెలుసని చెప్పారు. వారు కట్నం కోసమే ఈ వివాహం చేశారు. తన భర్తకు చికిత్స చేయించుకోవడానికి అత్తమామలు తనను రెండు లక్షల రూపాయలు అడిగారని భార్య ఆరోపిస్తోంది. మొదట్లో సర్దుకుని కాపురం చేయాలని ఆ మహిళ భావించింది. ఈ విషయం తెలిసిన తన బావ ఆమెను వేధించడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని ఆమె అత్తమామలకు చెప్పడంతో ఆమెను కొట్టారు. ఆమెను ఉరి వేసి చంపడానికి కూడా ప్రయత్నించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
READ MORE: Vem Narender Reddy: రాష్ట్రం వాళ్ల సొత్తు అన్నట్లు కేసీఆర్ కుటుంబం వ్యవహరిస్తోంది!
