వరకట్నం తీసుకోవడం నేరం.. అని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా మార్పు మాత్రం రావడం లేదు. అక్కడితో ఆగుతున్నారా అంటే.. అదీ లేదు. పెళ్లైన కొన్ని రోజులకే అదనపు కట్నం కోసం భార్యలను వేధిస్తూ మానసిక వేదనకు గురిచేస్తున్నారు కొందరు భర్తలు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పెళ్లైన కొన్ని రోజులకే అదనపు కట్నం కోసం వేధిస్తూ తనను ఇంట్లో నుంచి గెంటి వేశాడని ఓ భార్య ఆరోపిస్తుంది. తనకు న్యాయం చేయాలని కోరుతూ భర్త ఇంటి ముందు నిరసనకు దిగింది.
Also Read:Bobbili Tragedy: బొబ్బిలిలో స్కూల్ విద్యార్థుల మధ్య గొడవ.. ఒకరు మృతి!
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్న బోనాల గ్రామానికి చెందిన పరుశురాములతో మల్కపేట గ్రామానికి చెందిన కీర్తనకు నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. పెళ్లయిన కొద్ది రోజులకే భర్త పరుశరాములు అదనపు కట్నం కోసం వేధింపులు మొదలుపెట్టాడని కీర్తన తెలిపింది. తనను ఇంటి నుండి గెంటివేశాడని భార్య కీర్తన ఆరోపించింది. ఇరు కుటుంబాల మధ్య పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీలు నిర్వహించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు.
Also Read:Tejeswar Murder case: మహానటి.. ప్రియుడి మోజులో భర్తను చంపి.. కంట్లో గ్లిజరిన్ వేసుకుని దొంగ ఏడుపు
తనకు జరిగిన అన్యాయాన్నీ పెద్దమనుషులు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లిన న్యాయం చేయలేదంటూ బాధితురాలు కీర్తన ఆవేదన వ్యక్తం చేసింది. పెళ్లి సందర్భంలో ఇచ్చిన కట్నం డబ్బులు తనకు తిరిగి ఇచ్చేయాలని మహిళా సంఘాలతో కలిసి అత్తవారింటి ముందు బాధితురాలు కీర్తన నిరసనకు దిగింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
