Site icon NTV Telugu

Viral News:భర్తకు విషం కలిపిన కాఫీ ఇస్తున్న భార్య… అతను ఏం చేశాడంటే?

Wife

Wife

సాధారణంగా భర్తను తమ పంచప్రాణాలుగా భావిస్తుంటారు భార్యలు. భర్తకు చిన్న ఆరోగ్య సమస్య వస్తేనే విలవిలలాడిపోతూ ఉంటారు. అలాంటిది ఓ భార్య తన భర్తను చంపేందుకు మాస్టర్ ప్లాన్ వేసింది. దొరకకుండా ఉండటం కోసం అతనికి కొంతకాలంగా కాఫీలో కొద్ది కొద్దిగా విషపదార్థాన్ని కలిపి ఇచ్చింది. ఇది గమనించిన భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటన అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో వెలుగుచూసింది.

వివరాల ప్రకారం మెలోడీ ఫెలికానో జాన్సన్‌, రాబీ జాన్సన్‌ భార్యభర్తలు. రాబీ జాన్సన్‌ యూఎస్‌ ఎయిర్‌ ఫోర్స్‌ లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. రోజూ తన భార్య ఇచ్చే కాఫీ టేస్ట్ వేరుగా ఉండటం జాన్సన్ గమనించాడు. అతనికి అనుమానం వచ్చి నేరుగా ప్రశ్నించకుండా భార్యపై ఓ కన్నెశాడు. దీని కోసం భార్యకు తెలియకుండా వంటగదిలో సీసీ కెమెరాను అమర్చాడు. వాటి ద్వారా తన భార్య కాఫీలో ఏదో కలుపుతుందని గమనించాడు.

Also Read: Air Hostess: శృంగార సేవలు అందిస్తున్న ఎయిర్ హోస్టెస్‌లు.. ఒక రాత్రికి 2.4 లక్షలు!

అయితే భార్యకు అనుమానం రాకుండా ఆమె ఇచ్చే కాఫీ తాగుతున్నట్లుగా రోజూ నటించే వాడు జాన్సన్. అలా కొన్ని రోజులకు పూర్తి ఆధారాలు సేకరించి భార్య మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వీడియోల ద్వారా భార్య బండారాన్ని బట్టబయలు చేశాడు. జాన్సన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భార్య మెలోడీని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే భర్త చనిపోయాక వచ్చే ప్రయోజనాల కోసమే మెలోడీ ఇలా చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వార్త వైరల్ గా మారడంతో తెలిసిన వారందరూ ఇలా కూడా చేస్తారా అంటూ భయపడుతున్నారు.

Exit mobile version