Vietnam Air Hostesses Caught Offering *ex Services at Hotel: గొప్ప పొజిషన్‌లో ఉండే ఎయిర్ హోస్టెస్‌లు అక్రమ లైంగిక కార్యకలాపాలకు పాల్పడుతూ దొరికిపోయారు. వియత్నాంలోని ఓ విలాసవంతమైన హోటల్‌లో శృంగార సేవలు అందిస్తూ అక్కడి పోలీసులకు తాజాగా పట్టుబడ్డారు. పోలీసుల దాడిలో ముగ్గురు ఎయిర్ హోస్టెస్‌లు మరియు ఒక మోడల్ దొరికిపోయారు. వీరు ఒక రాత్రికి దాదాపుగా 3000 వేల డాలర్లు (భారత కరెన్సీలో రూ. 2.4 లక్షలు) వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది.
వియత్నాం ఎయిర్‌లైన్స్‌లో క్యాబిన్ క్రూ సభ్యుడు వో థి మై హాన్.. హో చి మిన్ సిటీలోని ఒక విలాసవంతమైన హోటల్‌లో అక్రమ లైంగిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. వో థి మై హాన్ ముందుగా కస్టమర్‌లకు ఎయిర్ హోస్టెస్, మోడల్స్, హాట్ గర్ల్స్ ఫొటోలు పంపిస్తాడు. కస్టమర్‌కు తమకు నచ్చిన వారిని ఎంపిక చేసుకున్నాక.. వారి నుంచి డబ్బు తీసుకుంటాడు. ఆపై కస్టమర్‌లను హో చి మిన్ సిటీలోని అమ్మాయిలు ఉన్న హోటల్‌కు పంపిస్తాడు.
ఈ విషయం తెలుసుకున్న హో చి మిన్ సిటీ పోలీస్ డిపార్ట్‌మెంట్ గత బుధవారం రాత్రి హోటల్‌పై రైడ్ చేశారు. ఈ రైడ్‌లో ముగ్గురు ఎయిర్ హోస్టెస్ (యాక్టివ్ ఫ్లైట్ అటెండెంట్‌లు)లను పోలీసులు వేర్వేరు గదుల్లో అబ్బాయిలతో బెడ్‌పై ఉండగానే పట్టుకున్నారు. ఓ మోడల్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ లైంగిక కార్యకలాపాల ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న 26 ఏళ్ల మహిళను, ఎయిర్‌లైన్స్‌లో క్యాబిన్ క్రూ సభ్యుడు వో థి మై హాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేరానికి పాల్పడినట్లు మై హాన్ అంగీకరించాడు. దాంతో అతడిపై వియత్నాం పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.