Wife Killed Husband: మద్యం సేవించి భార్యను నానా హింసలు పెట్టడంతో,ఆ బాధలు భరించలేక కట్టుకున్న భార్య తన భర్తను కడతేర్చిన ఘటన ఏపీలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం అయినవిల్లి లంకలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. భర్త రోజూ తాగివచ్చి చిత్రహింసలు పెడుతుండడంతో విసిగిపోయిన భార్య చెంబుతో కొట్టి దారుణంగా హతమార్చింది.
Also Read: Eluru: కన్న కూతుళ్లను బలిపెట్టిన కసాయితల్లి.. రెండో భర్తకు పిల్లలు పుట్టాలని..
ఇసుకపట్ల రామకృష్ణ (34) రోజూ తాగి వచ్చి భార్యతో పాటు తల్లిదండ్రులను కొట్టేవాడు. దీంతో విసిగిపోయిన భార్య సత్య నారాయణమ్మ.. చెంబుతో భర్త తలపై బలంగా కొట్టడంతో చనిపోయాడని స్థానికులు తెలిపారు. భర్త చిత్రహింసలు భరించలేకే అతడిపై దాడి చేసినట్లు కుటుంబసభ్యులకు నారాయణమ్మ తెలిపింది. స్థానికుల సమాచారం మేరకు.. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.