Wife Killed Husband: ఏపీలో ఇటీవల భర్తలు, భార్యల హత్యలు కలకలం రేపుతున్నాయి. ప్రతి నిత్యం ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి వార్త వినాల్సి వస్తోంది. అయితే భార్యను చంపిన భర్త అని లేదా భర్తను చంపిన భార్య అని.. తాజాగా మరో ఘటన సంచలనంగా మారింది. ఓ భార్య తన భర్తను కడతేర్చింది. విజయనగరం జిల్లా గరివిడి మండలం వెదుళ్లవలసలో దారుణం చోటుచేసుకుంది. భర్త వేధింపులు తట్టుకోలేని ఓ భార్య తన మామ సహకారంతో అతడిని కిరాతంగా హత్య చేసింది. తాగొచ్చి నిత్యం వేధింపులకు గురి చేస్తుండటంతో విచక్షణ కోల్పోయి అతడిని అంతమెుందించింది. వెదుళ్లవలసకు చెందిన కొలుసు అప్పన్న, దేవి ఇద్దరు భార్యాభర్తలు. తాగుడుకు బానిసైన అప్పన్న తరచూ భార్యను డబ్బుల కోసం ఇబ్బంది పెట్టేవాడు. ఆమెపై అనుమానంతో వేధింపులకు పాల్పడేవాడు.
Read Also: Bengaluru: బెంగళూరులో పోలీసులపై దాడి.. ఎనిమిది మంది నైజీరియన్లు అరెస్ట్..
శుక్రవారం ఇంటికి తాగి వచ్చిన భర్తతో గొడవకు దిగింది. అయితే గత కొన్ని రోజుల నుంచి వారిద్దరి మధ్య గొడవ జరుగుతూ ఉండడంతో విసుగుచెందింది. క్షణికావేషానికి లోనై తాగొచ్చి గొడవ చేస్తున్న భర్తను ఉరేసి భార్య దేవి హత్య చేసింది. ఈ హత్యకు మామ ముంత సన్యాసిరావు సహకరించినట్లు పోలీసులు వెల్లడించారు. తాగుడికి బానిసై రోజూ ఇంట్లో పోరు పెడుతున్నాడని.. తాగిన మైకంలో ఉన్న అప్పన్నను భార్య హత్య చేసింది. రోజూ తాగొచ్చి గొడవకు దిగడం, వేధింపులకు గురిచేస్తుండడంతో.. కట్టుకున్న భర్తనే హత్య చేసింది ఆ ఇల్లాలు.