Extra Marital Affair: హృదయవిదారకం.. నర్సుతో పెళ్లి కోసం భార్య హత్య, ప్రేమించి పెళ్లాడిన ఇల్లాలినే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Extra Marital Affair: వివాహేతర సంబంధాల కారణంగా ఎన్ని కాపురాలు కూలిపోయాయో అందరికీ తెలుసు. అయినా ప్రజల్లో మార్పు రావడం లేదు. రెండు నిమిషాల మోజు కోసం అడ్డదారులు తొక్కుతూనే ఉన్నారు. తమ పచ్చని సంసారాల్ని తామే నిప్పు పెట్టేసుకుంటున్నారు. తాజాగా వేరే మహిళను పెళ్లి చేసుకునేందుకు ఓ వ్యక్తి తన మొదటి భార్యను కిరాతకంగా హత్యచేశాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో జరిగింది. మొదటి భార్యకు ప్రాణాంతకమైన ఇంజెక్షన్లు, మందులు ఇచ్చి హతమార్చాడు. తన భార్యనే ప్రాణాంతక సూదులతో హత్య చేసిన నిందితుడు స్వప్నిల్ సావంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Shraddha Walker Case: శ్రద్ధ హత్య కేసులో మరో ట్విస్ట్.. ముక్కలు చేసి చంపేస్తాడని 2020లోనే ఫిర్యాదు
Also Read
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. స్వప్నిల్ సావంత్, ప్రియాంక అనే యువతిని కొన్నేళ్ల క్రితం ప్రేమించి వివాహం చేసుకున్నాడు. స్వప్నిల్ ఓ ప్రైవేట్ ఆస్పత్రి పని చేస్తుండగా.. ఆ సమయంలో అదే ఆస్పత్రిలో పని చేస్తున్న ఓ నర్సుతో అతడికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఆమెపై ప్రేమకు దారితీసింది. ఎలాగైనా ఆమెను రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అయితే అప్పటికే అతనికి ప్రియాంకతో వివాహం జరిగింది. తన రెండో పెళ్లికి మొదటి భార్య అడ్డుగా ఉందని భావించిన అతను.. ఎలాగైనా ప్రియాంకను హతమార్చాలని ప్లాన్ చేసుకున్నాడు. బీపీ, షుగర్ చికిత్స అని చెప్పి.. తాను పనిచేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రి నుంచి ఎవరికీ తెలియకుండా ప్రమాదకరమైన ఇంజెక్షన్లను భార్యకు ఇచ్చాడు. వాటి వల్ల ఆరోగ్యం దెబ్బతిని ప్రియాంక ప్రాణాలు కోల్పోయింది. అనుమానం వచ్చిన ప్రియాంక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విషయం వెలుగులోకి వచ్చింది. అతనే ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు తెలుసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి చర్యలు చేపట్టారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు