NTV Telugu Site icon

Crime News: క్రైమ్ సినిమా చూసి భార్య హత్య.. శరీరాన్ని ముక్కలుగా కోసి పలుచోట్ల పడేసిన భర్త

America Crime

America Crime

యూపీలోని బల్‌రామ్‌పూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో భర్త అతి కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో అందరూ షాక్ కు గురవుతున్నారు. నిందితుడు భర్త హత్యకు ముందు హాలీవుడ్ క్రైం సినిమాను చూసి భార్యను హత్య చేశాడు. అంతేకాకుండా.. ఆమె శరీరాన్ని ఆరు ముక్కలుగా చేసి, ఆ పార్ట్స్ ను పలు ప్రాంతాల్లో పడేశాడు. ఈ ఘటన ఆగస్టు 6న జరిగింది. అయితే.. అజబ్‌నగర్‌ కమరిహ్వాకు వెళ్లే దారిలో రెండు బస్తాల్లో మృతదేహం ముక్కలు కనిపించడంతో పోలీసులు విచారణ చేపట్టారు. అనంతరం నిందితుడైన భర్తను అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి హత్యకు ఉపయోగించిన బైక్‌, మొబైల్‌ ఫోన్‌, ఇనుప రంపం, ఛాపర్‌, హెక్సా బ్లేడ్‌, ఎలక్ట్రానిక్‌ కట్టర్‌ మిషన్‌ స్వాధీనం చేసుకున్నారు.

ఆగష్టు 6వ తేదీన మృతదేహం యొక్క అవశేషాలను రోడ్డు పక్కన రెండు బస్తాలలో కనిపించినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే.. వారు అక్కడికి చేరుకుని తెరిచి చూడగా అందులో శరీరం ముక్కలు కనిపించాయి. పోస్ట్‌మార్టం నివేదిక అనంతరం.. ఒక మహిళ మృతదేహంగా నిర్ధారించారు. ఈ క్రమంలో.. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎస్‌పి, అదనపు పోలీసు సూపరింటెండెంట్‌ నేతృత్వంలో సిట్‌ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ హత్య ఘటనను చేధించేందుకు పలు టీంలు రంగంలోకి దిగాయి. కాగా.. ఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా మహిళను గుర్తించలేకపోయారు. 15 జిల్లాల్లో నమోదైన సుమారు 500 మంది తప్పిపోయిన మహిళల మిస్సింగ్ పై దర్యాప్తు చేపట్టారు.

Nuziveedu: నూజివీడులో పెద్ద చెరువుకు గండి.. జలదిగ్బంధంలో 50 ఇళ్లు

ఘటనా స్థలానికి సమీపంలోని అగర్వా కూడలిలో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అందులో ఆగస్ట్ 6వ తేదీ ఉదయం బైక్‌పై ఓ అనుమానాస్పద వ్యక్తి తెల్లటి బస్తాను తీసుకుని సంఘటన స్థలం వైపు వెళ్తున్నట్లు కనబడింది. ఆ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీలో నిందితుడి బైక్ నంబర్ కూడా లభ్యమైంది. ఆ బైక్ 260 రాణి బజార్, బద్గావ్ కొత్వాలి గొండా నివాసి రాధేశ్యామ్ గుప్తా కుమారుడు శంకర్ దయాల్ గుప్తా పేరిట రిజిస్టర్ అయినట్లు గుర్తించారు. అనుమానం వచ్చిన వ్యక్తి ఇంటిని తనిఖీ చేయగా తాళం వేసి ఉండడం కనిపించింది. వాహనం యజమాని తన భార్య, కుమారుడితో కలిసి ఇంట్లో నివాసముండే వారని స్థానికులు తెలిపారు. అయితే.. చాలా రోజులుగా ఇంట్లో నుంచి దుర్వాసన వెదజల్లుతోందని చెప్పారు.

Nani: ‘టైర్’ల గోల.. నన్ను వదిలేయండి ప్లీజ్!

మరోవైపు.. సెల్‌ఫోన్‌ నంబర్‌ దొరకడంతో నిఘా బృందం రంగంలోకి దిగింది. మంగళవారం పోలీసులు శంకర్ దయాళ్ గుప్తాను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన ఇనుప రంపం, ఛాపర్, హెక్సా బ్లేడ్ (సా), ఎలక్ట్రానిక్ కట్టర్ మిషన్, బైక్‌, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. శంకర్ దయాళ్ భార్య పేరు గుడియా పాండే పోలీసులు తెలిపారు. ఆమెకు 2023లో శంకర్ దయాళ్‌తో వివాహం జరిగింది. భార్యపై శంకర్ దయాళ్‌కు అనుమానాలు ఉన్నాయని.. ఈ క్రమంలో.. అతనికి, భార్యకు తరచూ గొడవలు జరిగేవని పోలీసులు పేర్కొన్నారు. జూలై 30వ తేదీన గుడియాను హత్య చేయాలని శంకర్ దయాళ్ ప్లాన్ చేశాడని.. ఆగస్టు 1న భార్య గొంతు కోసి హత్య చేశాడని పోలీసులు చెప్పారు. బ్లేడ్లు, ఎలక్ట్రానిక్ కట్టర్లతో భార్య శరీరాన్ని మూడు భాగాలుగా కోశాడన్నారు. ఆగస్టు 6న బల్‌రాంపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రెండు బస్తాలల్లో శరీర భాగాలు తీసుకొచ్చి పడేశాడని.. ఆగస్టు 7వ తేదీన ఓ గోనె సంచిని తీసుకుని అయోధ్యలోని సరయూ నది వంతెన కింద పడేశాడని.. అనంతరం నిందితుడు లక్నోకు పారిపోయాడని పోలీసులు చెప్పారు.

Show comments