NTV Telugu Site icon

Andhra Pradesh Crime: ప్రియుడి మోజులో పడి భర్తకు స్టెరాయిడ్స్‌.. కోమాలో బాధితుడు

Steroids

Steroids

Andhra Pradesh Crime: పచ్చని కాపురాల్లో వివాహేతర సంబంధాలు చిచ్చు పెడుతున్నాయి.. కుటుంబ పోషణ, సంపాదనలో భర్తలు ఉంటే.. కొందరు భార్యలు.. వివాహ వ్యవస్థకు మచ్చ తెస్తూ.. మరొకరి మోజులో పడిపోతున్నారు.. భర్తను, పిల్లలను నిర్లక్ష్యం చేసేవారు కొందరైతే.. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను, పిల్లలను సైతం వదిలించుకోవడానికి వెనుకాడడం లేదు.. తాజాగా, ప్రియుడి మోజులో పడి భర్తకు స్టెరాయిడ్స్‌ ఇచ్చి చంపేందుకు ప్రయత్నించింది భార్య. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఈ ఘటన జరిగింది. పుంగనూరులోని కొత్తపేట క్రాస్‌ రోడ్డులో క్లినిక్‌ నిర్వహిస్తోంది భార్య ఈశ్వరి. అధిక మోతాదులో స్టెరాయిడ్స్‌ ఇవ్వడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు నాగరాజు. తిరుపతి స్విమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. అధిక మోతాదులో మెడిసిన్‌ వాడటం వల్ల కోమాలోకి వెళ్లినట్లు తెలిపారు. భార్య ఈశ్వరి, ప్రియుడు సాజిద్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కాగా, ప్రియుడు మోజులో పడి, వివాహేతర సంబంధాలతో పచ్చని సంసారాల్లో చిచ్చు పెట్టుకుంటున్నారు కొందరు దంపతులు.. ఇటు భార్యలు, అటు భర్తలు కూడా తాత్కాలిక సుఖం కోసం అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.. సొంతవారు అనే విషయాన్ని మర్చి దారుణాలకు పాల్పడుతున్నారు.. తీరా విషయం బటయపడిన తర్వాత ఊచలు లెక్కపెడుతున్నారు.

Read Also: PM Modi: 8.5కోట్ల మంది రైతులకు ప్రధాని మోడీ కానుక.. వారి ఖాతాలో 17,000 కోట్లు

Show comments