NTV Telugu Site icon

Woman Suicide: మరో మహిళతో భర్త.. తట్టుకోలేక పిల్లలతో కలిసి రైలు కింద దూకి..!

Woman Suicide

Woman Suicide

Woman Suicide: బీహర్‌లోని అర్రా జిల్లాలో రైలు ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో ఆ మహిళ తన ముగ్గురు చిన్నారులతో సహా రైలు ముందు దూకింది. ఈ ఘటనలో సదరు మహిళ మృతి చెందగా.. ముగ్గురు పిల్లలు గాయపడ్డారు. ఘటనా స్థలంలో ఉన్న ప్రయాణికులు, స్థానికులు గాయపడిన ముగ్గురు చిన్నారులను చికిత్స నిమిత్తం అర్రా సదర్‌ ఆస్పత్రికి తరలించారు. ఇందులో ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం పాట్నాకు తరలించారు. దానాపూర్-పీడీడీయూ రైల్వే సెక్షన్‌లోని అర్రా రైల్వే స్టేషన్‌లో ఉన్న ఈస్టర్న్ రైల్ ఓవర్ బ్రిడ్జి సమీపంలో ఈ ఘటన జరిగింది. హిమగిరి ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి ఆ మహిళ ఆత్మహత్య చేసుకుంది.

నవాడా పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న మనీష్ కుమార్, గుడియా దేవి దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలు జ్యోతి కుమారి (13 ఏళ్లు), జయ కుమారి (10 ఏళ్లు), 9 ఏళ్ల కుమారుడు కౌశిక్ కుమార్ ఉన్నారు. మనీష్‌ కుమార్‌ వృత్తిరీత్యా డ్రైవర్‌ కాగా.. అతను ఓ ప్రైవేట్ వాహనం నడుపుతున్నాడు. వారి జీవితం సాఫీగా సాగుతున్న తరుణంలో మనీష్‌ కుమార్‌ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో దంపతుల మధ్య గొడవలు జరుగుతుండేవి. మనీష్ కుమార్‌ గుడియా దేవిని, పిల్లలను తరచూ కొట్టేవాడు. ఈ నేపథ్యంలో ఆమె పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది.

Also Read: Teacher Harassment: యువతిపై మాష్టారు లైంగిక వేధింపులు.. గుడ్డలూడదీసి మరీ..

తన పిల్లలతో సహా రైలు కింద దూకేసింది. ఈ ఘటనలో తల్లి చనిపోగా.. ముగ్గురు పిల్లలు గాయాలతో బయటపడ్డారు. గాయాలపాలైన పిల్లలను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. వీరికి ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. గాయపడిన పిల్లల్లో కౌశిక్ కుమార్ పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం పాట్నాకు తరలించారు. అయితే ఈ ఘటనను ఫోన్‌లో ధ్రువీకరిస్తూ.. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో రైలు ట్రాక్‌ దాటుతున్నట్లు సమాచారం అందిందని అర్రా రైల్వే స్టేషన్‌ ఆఫీసర్‌ పంకజ్‌ దాస్‌ తెలిపారు. ఇంతలో రైలు కింద పడి మహిళ మృతి చెందింది. కాగా అతని ముగ్గురు పిల్లలు గాయపడ్డారు. ప్రస్తుతం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించే పనిలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.