Music Teacher Harassed His Student 3 Boys Atttacked Him: సంగీత పాఠాలు నేర్పించాల్సిన ఓ మాష్టారు తప్పుడు రాగం పాడాడు. యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇది గమనించిన ముగ్గురు యువకులు.. ఆ మాష్టారుకి బుద్ధి చెప్పారు. అంతటితో ఆగకుండా.. మాష్టారుతో పాటు యువతి పట్ల కూడా వాళ్లు అసభ్యంగా ప్రవర్తించారు. ఇద్దరు గుడ్డలు తీసి, దేహశుద్ధి చేశారు. ఆపై వీడియో తీసి, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇది బీహార్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Chain Snatching: చైన్ స్నాచింగ్ దొంగలు అరెస్ట్.. 16 తులాల బంగారం, రెండు బైక్‌లు, ఒక ఆటో..
బెగుసరై పత్‌కౌలా గ్రామం కిషన్ దేవ్ చౌరాసియా(45) ఒక మ్యూజిక్ టీచర్‌గా పని చేస్తున్నాడు. కొన్ని రోజుల నుంచి అతడు ఓ యువతికి (20)కి మ్యూజిక్ పాఠాలు నేర్పిస్తున్నాడు. అయితే.. దుర్బుద్ధి గల ఆ మాష్టారు, ఆ యువతిపై కన్నేశాడు. తన కూతురి వయసున్న ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇది గమనించిన ముగ్గురు యువకులు.. ఆ మాష్టారుపై దాడి చేశారు. అంతేకాదు.. ఆ యువతితో కూడా అసభ్యంగా ప్రవర్తించారు. ఇద్దరి బట్టలు ఊడదీసి కొట్టారు. అంతటితో ఆగకుండా.. ఈ మొత్తం తతంగాన్ని వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు.
Ponnam Prabhakar: అసంతృప్తిలో పొన్నం ప్రభాకర్.. కారణం అదే!
సంగీత పాఠాలు చెప్పాల్సిన మాష్టారు లైంగిక వేధింపులకు పాల్పడటంతో.. కిషన్ సింగ్ చౌరాసియాపై పోక్సో చట్టం, ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టంతోపాటు మరికొన్నిసెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. అతడ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామన్నారు. అలాగే.. మాష్టారుతో పాటు యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ముగ్గురు యువకుల కోసం గాలిస్తున్నామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా వారిని అరెస్ట్ చేస్తామని తెలిపారు.