WI vs IND: కనీస సదుపాయాలు లేవు.. వెస్టిండీస్ క్రికెట్ బోర్డుపై అశ్విన్ అసంతృప్తి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
No Grass and Old Nets in West Indies Says R Ashwin: వెస్టిండీస్ మైదానాల్లో కనీస సదుపాయాలు లేకపోవడంపై భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. విండీస్ మైదానాల్లో మౌలిక సదుపాయాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని, మరింత మెరుగైన సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఎంతో ఉందని యాష్ అభిప్రాయపడ్డాడు. క్రికెట్ వృద్ధి చెందాలంటే మౌలిక వసతులు మెరుగ్గా ఉండాలన్నాడు. భారత జట్టు వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ఆడుతున్నా.. అంతకుముందు జరిగిన టెస్ట్ సిరీస్‌లో అశ్విన్ ఆడిన విషయం తెలిసిందే.
రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ… ‘వెస్టిండీస్‌లో క్రికెట్ వృద్ధి చెందాలంటే.. ముందుగా మౌలిక వసతులు బాగుండాలి. అండర్-10, అండర్-14, అండర్-19 ఆటగాళ్లకు మంచి నెట్స్, మైదానాలు ఉండేలా చూడాలి. అప్పుడే యువ ఆటగాళ్లలో క్రికెట్ ఆడే ఆసక్తి పెరుగుతుంది. క్రికెట్ ఆట టాలెంట్‌తో కూడిన గేమ్ కాబట్టి బాగా శ్రమించాలి. మైదానాల్లో మౌలిక సదుపాయాలు ఉన్నప్పుడే ఇది సాధ్యం అవుతుంది’ అని అన్నాడు.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
‘బార్బడోస్‌లో టెస్టు మ్యాచ్ సందర్భంగా నెట్స్‌లో మేం ప్రాక్టీస్ చేశాం. మైదానంలో కనీసం పచ్చిక కూడా లేదు. నెట్స్ కూడా చాలా పాతవి. నేను తప్పుబట్టడానికి ఇలా అనడం లేదు. మౌలిక వసతులు నాసికరంగా ఉన్నాయని చెబుతున్నా. ఇలాంటి పరిస్థితుల్లో నాణ్యమైన క్రికెట్ ఆడేందుకు విండీస్ ఆటగాళ్లుకు కూడా కష్టమే. ఇలాంటి పిచ్‌లపై ప్రాక్టీస్ చేసిన వారు మంచి పిచ్‌లపై ఆడేందుకు ఇబ్బంది పడతారు. పరిస్థితులకు అలవాటు పడటం కష్టమవుతుంది. విండీస్ పిచ్‌లు ఎప్పుడూ మందకొడిగా ఉంటాయి. మైదానాల నిర్వహణపై శ్రద్ధ పెట్టాలి’ అని ఆర్ అశ్విన్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?