Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Why Top Global Leaders Skip G20 Summit South Africa

G20 Summit: జీ–20 వేదికకు దూరంగా ఈ ముగ్గురు అగ్రనేతలు.. కారణం ఏంటో తెలుసా?

Published Date :November 22, 2025 , 3:33 pm
By Shiva Ganesh
G20 Summit: జీ–20 వేదికకు దూరంగా ఈ ముగ్గురు అగ్రనేతలు.. కారణం ఏంటో తెలుసా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

G20 Summit: 20 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా దక్షిణాఫ్రికాలో జి20 శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోహన్నెస్‌బర్గ్ చేరుకున్నారు. ఈ సదస్సులోని మూడు సెషన్లలో ఆయన పాల్గొంటారు. సమ్మిళిత అభివృద్ధి, వాతావరణ సంక్షోభం, కృత్రిమ మేధస్సు వంటి కీలక అంశాలపై ఆయన తన అభిప్రాయాలను ఈ వేదికపై పంచుకోనున్నారు. అయితే ప్రపంచంలోని ముగ్గురు అగ్ర నాయకులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ శిఖరాగ్ర సమావేశానికి హాజరు కాలేదు. ప్రపంచంలోని ముగ్గురు అత్యంత శక్తివంతమైన నాయకులు ఈ శిఖరాగ్ర సమావేశానికి ఎందుకు హాజరు కావడం లేదనే ప్రశ్న ఇప్పుడు ప్రపంచం ముందుకు వచ్చింది. ఈ ప్రశ్నకు సమాధాన్ని ఈ స్టోరీలో తెలుసుకుందాం.

అగ్రనాయకులు ఎందుకు రావడం లేదంటే..

* అమెరికా G20 వ్యవస్థాపక సభ్యదేశం, తదుపరి అధ్యక్ష పదవిని నిర్వహిస్తోంది. అలాంటి సమయంలో ఈ సమావేశంలో అగ్రరాజ్యం పాల్గొనకపోవడం అనేది ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో G20 శిఖరాగ్ర సమావేశానికి హాజరు కాబోనని స్పష్టంగా ప్రకటించారు. దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి రైతులు అణచివేతకు గురవుతున్నారని ఆయన ఆరోపించారు. కొత్త భూ సంస్కరణల చట్టం తర్వాత దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి రైతులు జాతి వివక్షను ఎదుర్కొంటున్నారని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే శిఖరాగ్ర సమావేశానికి ఒక రోజు ముందు, ట్రంప్ తన వైఖరిని మార్చుకున్నారు. శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావడానికి అమెరికా తన తాత్కాలిక రాయబారి మార్క్ డి. డిల్లార్డ్‌ను పంపింది.

* రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా దక్షిణాఫ్రికాను సందర్శించలేదు. దీనికి కారణం చాలా స్పష్టంగా ఉంది. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దక్షిణాఫ్రికా రోమ్ శాసనంలో సభ్యదేశం, అంటే ICC వారెంట్‌ను పాటించడం చట్టబద్ధంగా బాధ్యత. అంటే పుతిన్ G20కి హాజరై ఉంటే, దక్షిణాఫ్రికా చట్టబద్ధంగా ఆయనను అరెస్టు చేయాల్సి ఉండేది. అందుకే ఆయన దక్షిణాఫ్రికాలో జరిగిన 2023 బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి కూడా హాజరు కాలేదు.

* ఈసారి చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ కూడా జి20 శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావడం లేదు. పలు నివేదికల ప్రకారం.. ఆయన అనారోగ్యంతో ఉన్నారని, అందుకే ఆయన బదులుగా చైనా ప్రధాన మంత్రి లీ కెకియాంగ్‌ను తన ప్రతినిధిగా పంపినట్లు కథనాలు వస్తున్నాయి. చైనా – దక్షిణాఫ్రికా మధ్య బలమైన వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. జి జిన్‌పింగ్ 2023 బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి దక్షిణాఫ్రికాను సందర్శించారు.

ఈ ముగ్గురి లోటు భారతదేశ ప్రాముఖ్యతను పెంచింది..
ఈ G20 శిఖరాగ్ర సమావేశానికి ట్రంప్, పుతిన్, జి జిన్‌పింగ్ వంటి ప్రముఖ నాయకులు రాకపోవడంతో భారతదేశ పాత్రను మరింత కీలకంగా మార్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచ సమస్యలపై ప్రధాని మోడీ తన అభిప్రాయాలను ఎలా వ్యక్తం చేస్తారో, అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతులను ఈ వేదికపై ఎలా ప్రకటిస్తారు అనే దానిపై ప్రపంచం ఆసక్తిగా గమనిస్తుంది. ఈ పర్యటనకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ఈ శిఖరాగ్ర సమావేశం భారతదేశానికి ప్రత్యేకమైనదని అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • China PM Li Qiang G20
  • G20 Summit South Africa
  • global leaders miss summit
  • India role G20
  • Modi G20 participation

తాజావార్తలు

  • Gudivada Amarnath: చంద్రబాబుకు ఓటేసి ప్రజలు నాలుగోసారి మోసపోయారు..!

  • Madhubala biopic: సంజయ్ లీలా భన్సాలీ బిగ్ ప్లాన్.. మధుబాలగా మలయాళ భామ !

  • Islamabad: ఇస్లామాబాద్ చేరుకున్న జేడీ వాన్స్ బృందం.. చర్చలు ఆలసమయ్యే ఛాన్స్

  • Jailer 2: ‘జైలర్ 2’లో షారుఖ్ ఔట్.. పవన్ కళ్యాణ్ ఇన్? రజినీకాంత్ మూవీలో పవర్ స్టార్ సెన్సేషన్!

  • Tirumala Devotees Record: రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు.. ఏడాదిలో 2.67 కోట్ల మందికి దర్శనం..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions