NTV Telugu Site icon

Late Sleeping: రాత్రి 12 తర్వాత నిద్రపోతున్నారా.. ఈ సమస్యలు తప్పవు..!

Late Sleeping

Late Sleeping

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు రాత్రి నిద్రపోవడం ఎంత ముఖ్యమో, సమయానికి నిద్ర లేవడం కూడా అంతే ముఖ్యం. అయితే.. రాత్రి 10 గంటలకే నిద్రపోవాలని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. జీవక్రియ ఆరోగ్యంగా ఉండటానికి.. అనేక రకాల వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షించడానికి ఇది చాలా ముఖ్యం. వైద్యులు తొందరగా పడుకోవాలని సూచిస్తున్నా.. కొందరైతే రాత్రి 12 తర్వాత నిద్రపోయే వారు ఉన్నారు. అయితే.. రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడం, సరిపడా నిద్రపోకపోవడం ఆరోగ్యానికి అనేక విధాలుగా హానికరం.

తరచుగా రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతే మానసిక స్థితి సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీర్ఘకాలంలో ఇది అనేక ఇతర ఆరోగ్య సంబంధిత హానిని కలిగిస్తుందని చెబుతున్నారు. నేటి వేగవంతమైన జీవనశైలి, పెరుగుతున్న డిజిటల్ స్క్రీన్‌ల వాడకం, పని ఒత్తిడి కారణంగా నిద్ర కూడా బాగా ప్రభావితమైంది. మీరు కూడా దీని బారిన పడితే జాగ్రత్తగా ఉండండి.

రాత్రి ఎక్కువసేపు మేల్కొని ఉండడం హానికరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీని కారణంగా శారీరకంగా, మానసికంగా శరీరాన్ని రిఫ్రెష్ చేయలేము. లేటుగా నిద్ర పోవడం వల్ల జీవక్రియ, రోగనిరోధక శక్తి, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. రాత్రి 10 నుంచి 11 గంటల మధ్య నిద్రపోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. 12 గంటల తర్వాత నిద్రించే అలవాటు అనేక రకాల వ్యాధులను పెంచుతుంది.

Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త బౌలింగ్ కోచ్‌గా మునాఫ్ పటేల్‌..

జీవక్రియ సమస్య:
రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం జీవక్రియపై చెడు ప్రభావం చూపుతుంది. క్రమం తప్పకుండా ఆలస్యంగా నిద్రపోయేవారిలో శరీరంలో కొవ్వు స్థాయిలు పెరుగుతాయని పరిశోధనలో తేలింది. స్లో మెటబాలిజం బరువు పెరిగే ప్రమాదాన్ని పెంచుతుంది.. ఊబకాయం ప్రమాదాన్ని పెంచుతుంది. అధిక బరువు కూడా మధుమేహం, గుండె జబ్బులు, జీర్ణక్రియకు సంబంధించిన అనేక ఇతర రుగ్మతలకు దారితీస్తుంది.

మానసిక ఆరోగ్యంపై ప్రభావం:
మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి నిద్ర పొందడం చాలా ముఖ్యం. రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడం వల్ల మూడ్ స్వింగ్స్, డిప్రెషన్, యాంగ్జయిటీ వంటి మానసిక సమస్యలు వస్తాయి. మీరు రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతున్నప్పుడు, అది శరీరంలో సెరోటోనిన్, డోపమైన్ వంటి హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. ఇది మానసిక అలసట, చిరాకును కలిగిస్తుందని అధ్యయనాలు కనుగొన్నాయి. దీర్ఘకాలికంగా ఇది ఒత్తిడి, ఆందోళనను కూడా పెంచుతుంది.

గుండె, మధుమేహం వచ్చే ప్రమాదం:
రాత్రిపూట ఆలస్యంగా పడుకోవడం వల్ల అధిక రక్తపోటు సమస్య పెరుగుతుందని తేలింది. నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్ (కార్టిసాల్) స్థాయి పెరగడం ప్రారంభమవుతుంది. ఇది గుండెపై మరింత ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ అలవాటు గుండెపోటు, స్ట్రోక్, ఇతర గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అదే విధంగా ఆలస్యంగా నిద్రపోయే వారికి షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేయడం కష్టం. ఇది ఇన్సులిన్‌కు శరీరం యొక్క సున్నితత్వాన్ని తగ్గిస్తుంది. దీంతో.. రక్తంలో చక్కెరను నియంత్రించడం కష్టతరం చేస్తుంది.

Show comments