Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home T20 World Cup Why Pakistan Boycott India Match Icc Questions Double Standards

Pakistan vs ICC: భారత్ మ్యాచ్‌కే బాయ్‌కాట్ ఎందుకు?.. పాకిస్థాన్ ద్వంద్వ వైఖరిపై ఐసీసీ ఫైర్

Published Date :February 2, 2026 , 9:22 am
By Chandra Shekhar Pamena
  • క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసేలా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం..
  • భారత్‌తో టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాక్ ప్రకటన..
  • టోర్నీలో కొనసాగుతునే భారత్ మ్యాచ్‌నే బాయ్‌కాట్ చేసిన పాకిస్థాన్..
Pakistan vs ICC: భారత్ మ్యాచ్‌కే బాయ్‌కాట్ ఎందుకు?.. పాకిస్థాన్ ద్వంద్వ వైఖరిపై ఐసీసీ ఫైర్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Pakistan vs ICC: క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసేలా భారత్‌తో జరగాల్సిన తమ టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌ను (ఫిబ్రవరి 15) “బహిష్కరిస్తున్నట్లు” పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే, భారత్‌తో మ్యాచ్‌ను మాత్రమే బహిష్కరించి మిగతా అన్ని జట్లతో ఆడేందుకు అనుమతి ఇవ్వడం తీవ్ర వివాదానికి దారి తీస్తోంది. ఈ నిర్ణయాన్ని బంగ్లాదేశ్‌కు సంఘీభావంగా తీసుకున్న చర్యగా పాకిస్థాన్ ప్రభుత్వం సమర్థించుకుంటున్నా.. లోతుగా పరిశీలిస్తే ఇందులో స్పష్టమైన ద్వంద్వ ప్రమాణాలు కనిపిస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బంగ్లాదేశ్ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చేందుకు ఐసీసీ నిరాకరించడాన్ని పాకిస్థాన్ వ్యతిరేకిస్తోంది అని ఆ దేశ పాకిస్థాన్ మీడియా కథనాలు ప్రకారం చేసింది. గతంలో ఛాంపియన్స్ ట్రోఫీ, మహిళల వన్డే వరల్డ్‌ కప్‌లకు హైబ్రిడ్ మోడల్‌ను అనుసరించిన ఐసీసీ, ఇప్పుడు “పక్షపాత నిర్ణయాలు” తీసుకుంటోందని పాక్ ఆరోపిస్తోంది. ఫిబ్రవరి 15న భారత్‌తో మ్యాచ్‌ను ఆడవద్దని జట్టుకు ఆదేశాలు ఇచ్చాం.. ఇది ఒక నిరసన చర్య, “న్యాయం, సమానత్వం అనే సూత్రాలు పక్షపాత నిర్ణయాలతో ధ్వంసమయ్యాయి” అని అక్కడి న్యూస్ ఛానల్ పేర్కొంది.

Read Also: Nagarajuna Akkineni : నాగ్ కోసం కథ రెడీ చేస్తున్న హిట్ దర్శకుడు

భారత్- ఐసీసీపై పాక్ మీడియా అక్కసం:
అయితే, పాకిస్థాన్ మొత్తం టోర్నీ నుంచే తప్పుకోవాల్సి ఉండేది.. కానీ భారత్‌తో మ్యాచ్‌ను మాత్రమే బహిష్కరించి, మిగతా అన్ని మ్యాచ్‌లలో పాల్గొనడం ద్వారా ఐసీసీ నుంచి వచ్చే ఆదాయాన్ని పీసీబీ అందుకుంటూనే ఉంది. అదే ఐసీసీని పక్షపాత సంస్థగా విమర్శిస్తూ, దాని ప్రయోజనాలను ఆస్వాదించడం స్పష్టమైన విరుద్ధతగా కనిపిస్తోంది. ఇక, భారత్ పాకిస్థాన్‌కు వెళ్లి ఆడేందుకు నిరాకరించడంపై పాక్ గతంలో ఎన్నో సార్లు నిరసనలు తెలిపింది. అయినప్పటికీ, భారీ గ్లోబల్ వీక్షకులు, భారీ ఆదాయం దృష్ట్యా ఐసీసీ టోర్నీల్లో భారత్‌తో ఆడేందుకు మాత్రం ఎప్పుడూ సిద్ధంగానే ఉంది. అలాంటిది, ఇప్పుడు అకస్మాత్తుగా భారత్‌తో ఒక్క మ్యాచ్‌ను మాత్రమే బహిష్కరించి బంగ్లాదేశ్‌కు మద్దతు తెలిపితే, రాజకీయ లబ్ధి కోసం వేసిన ఎత్తుగడగా కనిపిస్తోందా అని పాక్ కి చెందిన కొందరు విమర్శకులు గుప్పిస్తున్నారు. ఇక, ఒకే టోర్నీలో ఒక కీలక మ్యాచ్‌ను మాత్రమే వదిలేయడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధం.. నిజంగా ‘న్యాయ సూత్రాల’ కోసం బహిష్కరణ అనుకుంటే, మొత్తం ఈవెంట్ నుంచే తప్పుకోవాల్సి ఉంటుంది.. కానీ అలా చేయకుండా, టోర్నీకి అతిపెద్ద ఆదాయాన్ని తెచ్చే భారత్- పాకిస్థాన్ మ్యాచ్‌ను మాత్రమే అడ్డుకోవడం.. అదే సమయంలో ఆర్థిక శిక్షలు లేదా క్రీడా ఒంటరితనం నుంచి తప్పించుకోవడం కోసమే ఇలా పాకిస్తాన్ చేసిందని క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Read Also: Pak Boycott India Match: భారత్‌తో మ్యాచ్ బహిష్కరించిన పాక్.. PSLపై నిషేధం, ఆర్థిక ఆంక్షలతో పాకిస్థాన్ వాట్ నెక్ట్స్?

ఘాటుగా ఐసీసీ రియాక్షన్:
పాక్ ఆరోపణలపై ఐసీసీ తాజాగా స్పందించింది.. భారత్ తో మ్యాచ్ ఆడేందుకు దాయాది దేశం పునరాలోచన చేయాలని కోరింది. రాజకీయ కారణాలతో జట్లు తమకు నచ్చిన ప్రత్యర్థులను ఎంచుకుని బహిష్కరిస్తే, వరల్డ్‌కప్ నిర్మాణం, విశ్వసనీయత పూర్తిగా దెబ్బతింటుందని ఐసీసీకి తెలుసు.. ఇలాంటి ఎంపిక చేసిన మ్యాచ్ లు బహిష్కరణ చేయడం అంతర్జాతీయ క్రీడలకు ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారాన్ని బీసీసీఐపై కాకుండా ఐసీసీపై నిరసనగా చిత్రీకరించడం ద్వారా పాకిస్థాన్ నైతిక ఆధిక్యత సాధించేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. కానీ టోర్నీలో కొనసాగుతూ ఆర్థిక లాభాలను పొందుతున్నందుకు, ఈ “బహిష్కరణ” సమానత్వం కోసం చేసిన పోరాటంలా కాకుండా, ఒక నాటకీయ ప్రదర్శనలా మారిందన్న అభిప్రాయం క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bcci
  • icc
  • ICC vs Pakistan
  • India vs Pakistan
  • India vs Pakistan T20 World Cup issue

తాజావార్తలు

  • Train Coach: పెళ్లి కోసం ఏకంగా రైలు కోచ్ మొత్తాన్ని బుక్ చేసుకున్న కుటుంబం.. ఇలా బుక్ చేసుకునే వీలుందా?

  • Donald Trump: ‘‘దయచేసి ఆ పిచ్చివాడిని ఆపండి’’.. రష్యా, చైనాలను కోరిన IAEA మాజీ చీఫ్..

  • Fauzi Movie Leaks: లీకు వీరులకు ‘ఫౌజీ’ టీమ్ సీరియస్ వార్నింగ్.. సైబర్ చర్యలు షురూ!

  • Babu Jagjivan Ram Birth Anniversary: ప్రధాని కావాల్సిన దేశ తొలి దళిత ఉప ప్రధాని బాబుజీ.. కానీ అడ్డుకున్నది ఎవరు?

  • SRH History: ఎస్‌ఆర్‌హెచ్ చరిత్రలో ఈ రోజు ఎంతో ప్రత్యేకం.. 22 పరుగుల తేడాతో విజయం!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions