Railway Ticket: రైల్వే కౌంటర్ టికెట్ కంటే ఆన్‌లైన్ టికెట్ ఎందుకు ధర ఎక్కువ తెలుసా..?
- ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ పద్ధతిలో రైల్వే టికెట్ల బుకింగ్ ఆఫ్‌లైన్ టిక్కెట్ల కోసం రైల్వే స్టేషన్‌లోని కౌంటర్‌కు వెళ్లాలి కౌంటర్ టిక్కెట్ల ధరలు.. ఆన్‌లైన్ టిక్కెట్ల కంటే తక్కువ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ రైల్వే రైలు టిక్కెట్లను రెండు విధాలుగా బుక్ చేసుకోవచ్చు.. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ పద్ధతిలో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ టిక్కెట్ల కోసం సాధారణంగా రైల్వే స్టేషన్‌లోని కౌంటర్‌కు వెళ్లాలి. కౌంటర్ టిక్కెట్ల ధరలు.. ఆన్‌లైన్ టిక్కెట్ల కంటే తక్కువ ఉంటాయి. అయితే, ఈ ధర వ్యత్యాసం ఎందుకు జరుగుతుందో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా రాజ్యసభలో వివరణ ఇచ్చారు. రైల్వే కౌంటర్ల వద్ద క్యూలలో టిక్కెట్లు కొనేవారి కంటే ఐఆర్‌సిటిసి ద్వారా ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకునే ప్రయాణీకులు సర్వీస్ ఛార్జీలు, లావాదేవీల రుసుము కారణంగా ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం శుక్రవారం రాజ్యసభలో తెలిపింది.
Read Also: Kshama Sawant: ఇండో అమెరికన్ నేత క్షమా సావంత్‌కు ఎమర్జెన్సీ వీసా తిరస్కరించిన భారత్!
Also Read
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్‌లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Himmat Singh: అరెరే.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
- Rahul Gandhi: ఢిల్లీలో గళం.. రాంచీలో మౌనం.. విద్యార్థులపై రాహుల్ గాంధీ కపట ప్రేమ?
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) టిక్కెట్ల ధరలో వ్యత్యాసం గురించి శివసేన సభ్యుడు సంజయ్ రౌత్ అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తూ.. “ఆన్‌లైన్ టికెటింగ్ సౌకర్యాన్ని అందించడానికి IRCTC ఎక్కువ ఖర్చు చేస్తుంది. టిక్కెట్ మౌలిక సదుపాయాలు నిర్వహించడం, అప్‌గ్రేడ్ చేయడం, విస్తరించడం వంటి ఖర్చులను భరించడానికి IRCTC సర్వీస్ ఛార్జీలు విధిస్తుంది” అని అన్నారు. దీనితో పాటు.. ప్రయాణికులు బ్యాంకులకు లావాదేవీ ఛార్జీలను కూడా చెల్లిస్తారని అశ్విని వైష్ణవ్ అన్నారు.
Read Also: YSRCP: అక్కడ వైసీపీ నేతలకు కొత్త టెన్షన్..!
ఆన్‌లైన్ టిక్కెట్ల బుకింగ్: ప్రయోజనాలు
ఆన్‌లైన్ టిక్కెట్ల బుకింగ్ అనేది ప్రయాణీకులకు చాలా సౌకర్యవంతంగా మారిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. “ప్రస్తుతం 80 శాతానికి పైగా రిజర్వ్ చేయబడిన టిక్కెట్లు ఆన్‌లైన్ ద్వారా బుక్ చేయబడుతున్నాయి. IRCTC ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ ద్వారా ప్రయాణీకులు కౌంటర్‌కి వెళ్లి టిక్కెట్లు కొనడం ఇబ్బందిని నివారించవచ్చు. దీని ద్వారా ప్రయాణికులు సమయం, రవాణా ఛార్జీలను కూడా ఆదా చేయవచ్చు” అని పేర్కొన్నారు. “IRCTC ఆన్‌లైన్‌లో రిజర్వ్ చేసిన టిక్కెట్లను బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది. ఇది ప్రయాణీకులకు రిజర్వేషన్ కౌంటర్‌కు వెళ్లి టిక్కెట్లు బుక్ చేసుకునే ఇబ్బంది నుండి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే.. ప్రయాణ సమయం, రవాణా ఛార్జీలను కూడా ఆదా చేస్తుంది” అని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
తాజావార్తలు
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
-
Dhsnudh-Sivakarthikeyan : ధనుష్, శివకార్తికేయన్ సీక్వెల్స్ సినిమాలపై కోలీవుడ్‌లో భారీ హైప్
-
Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్‌లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
-
Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్‌తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
-
Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్‌ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!